PowerStarPawanKalyan: ఖుషి షో పడకుండా చేసిన జగన్ ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-12-31T14:32:08+05:30 IST

వేసిన ప్రతి చోటా షో హౌస్ ఫుల్ అయిపొయింది. జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ (Jana Sena chief) ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో, జగన్ (YS Jagan Government) ప్రభుత్వం ఎదో ఒకటి చేసి పవన్ కళ్యాణ్ సినిమాలు సరిగ్గా ఆడనివ్వకుండా చేస్తోంది.

PowerStarPawanKalyan: ఖుషి షో పడకుండా చేసిన జగన్ ప్రభుత్వం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హిట్ సినిమా 'ఖుషి' (Khushi re-released on December 31) డిసెంబర్ 31 న మళ్ళీ రెండోసారి విడుదల అయింది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకే కాదు, అన్ని వర్గాల ప్రేక్షకులకు చాలా ఇష్టమయిన సినిమా. ఈ సినిమాని మళ్ళీ పెద్దగా విడుదల చెయ్యడానికి ఆ చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నం ప్లాన్ చేశారు. ఈ సినిమా రెండో సారి కూడా ఏమాత్రం తగ్గకుండా రికార్డు లెవెల్లో స్క్రీన్స్ దొరికాయి. శనివారం, ఆదివారం అంటే పాత సంవత్సరం చివరి రోజు, కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ సినిమా ప్రేక్షకుల కోసమని విడుదల చేస్తున్నాడు. (Khushi is releasing only for two days December 31 and January 1)

khushi1.jpg

భూమిక చావ్లా (Bhumika Chawla) ఇందులో పవన్ కళ్యాణ్ కి (Pawan Kalyan) కథానాయికగా నటించింది. ఈ సినిమాలో పాటలు, మాటలు, సన్నివేశాలు ఒకటేంటి అన్నీ హైలైట్ అప్పట్లో ఒక సంచలనం. (Khushi film is a sensation at that time) ఈనాటికీ ఆ సినిమాని ఇంత పెద్దగా విడుదల చేస్తున్నారు అంటే, దానికున్న క్రేజ్ అలాంటింది.

khushi2.jpg

వేసిన ప్రతి చోటా షో హౌస్ ఫుల్ అయిపొయింది. జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ (Jana Sena chief) ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుండటంతో, జగన్ (YS Jagan Government) ప్రభుత్వం ఎదో ఒకటి చేసి పవన్ కళ్యాణ్ సినిమాలు సరిగ్గా ఆడనివ్వకుండా చేస్తోంది. భీమ్లా నాయక్ (Bheemla Nayak) కి అలానే చేసారు,ఇప్పుడు ఖుషి సినిమాకి కూడా అలానే చేస్తున్నారు. భీమవరం (Some of the theaters in Bheemavaram and other places of Andhra Pradesh) లో ఒక థియేటర్ లో సినిమా బుకింగ్స్ కూడా అయిపోయాయి, కానీ లాస్ట్ మినిట్ లో ఎదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ వుంది అని చెప్పి సినిమా షో ఆపేసారు. టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తామంటూ బోర్డు పెట్టారు.

khushi3.jpg

థియేటర్ లో షో వేస్తె, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ (Law and Order problem) ఏమి వస్తుందో తెలియదు కానీ, దీని వెనక జగన్ (Jagan government deliberately stops the Khushi film shows) ప్రభుత్వ హస్తం వుంది అన్నది స్పష్టంగా తెలుస్తోంది. అధికారం చేతిలో వుంది కదాని ఇలాంటి చిన్న చిన్న షోస్ ఆపగలరు కానీ, పవన్ కళ్యాణ్ కి వస్తున్న ప్రజా ప్రభంజనాన్ని ఎవరు అడ్డుకోగలరు అని కళ్యాణ్ అభిమానులు అంటున్నారు.

Updated Date - 2022-12-31T14:32:12+05:30 IST