PawanKalyan: పరిగెడుతున్న పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2023-05-09T21:16:40+05:30 IST

కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లో, తరువాత ముంబై లో, ఆ తరువాత పూణేలో ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ లో, ఇలా అటు ఇటు పరిగెడుతున్నాడు పవన్ కళ్యాణ్. ఇంతకీ దేనికి ఈ పరుగు...

PawanKalyan: పరిగెడుతున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan

ఒక అగ్ర నటుడు ఈమధ్య కాలం లో సంవత్సరానికి ఒక సినిమా షూటింగ్ లో పాల్గొనడమే చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. అలాంటిది మరి నాలుగు సినిమాలు ఏక కాలంలో చెయ్యడం అంటే మాటలా మరి. గత సంవత్సరం చిరంజీవి (MegaStar Chiranjeevi) ఇలా నాలుగు సినిమాలు షూటింగ్ ఏకకాలం లో చేశారు. ఇప్పుడు అతని తమ్ముడు పవన్ కళ్యాణ్ (PawanKalyan) కూడా ఏక కాలంలో నాలుగు సినిమాలు చేస్తూ అటూ ఇటూ పరిగెడుతున్నాడు. ఆమధ్య సముద్రఖని (Samuthirakani) సినిమా పూర్తి చేసాడు, ఇంకా ఒక పాట మాత్రమే బాకీ వుంది ఆ సినిమాకి, తరువాత హరీష్ శంకర్ (HarishShankar) దర్శకత్వం లో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' (UstaadBhagathSinh) చేసాడు.

pawankalyanogsets1.jpg

ఈ రెండు సినిమాలు చేసి ముంబై (Mumbai) వెళ్ళాడు దర్శకుడు సుజీత్ (Sujeeth) తో ఓజి (#OG) సినిమా షూటింగ్ కి. అక్కడ కొన్ని రోజులు చేసాక తరువాత పూణే దగ్గర వున్న ఒక లేక్ దగ్గర షూటిగ్ చేసాడు. ఈరోజు అక్కడ షూటిం ముగుంచుకుని రాత్రికి హైదరాబాద్ (Hyderabad) చేరుకున్నాడు. మళ్ళీ రేపటి నుండి 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ మొదలెడతాడు. అది కొన్ని రోజులు చేసాక, క్రిష్ (Krish) దర్శకత్వం లో వస్తున్న 'హరిహర వీరమల్లు' (HariharaVeeramallu) సినిమా చేస్తాడు.

Janasena-Pawan-1.jpg

ఇలా ఒక సినిమా నుండి, ఇంకో సినిమాకి, ఒక పాత్ర నుండి ఇంకో పాత్రకి పవన్ కళ్యాణ్ మారుతున్నాడు. పరిగెడుతున్నాడు, షూటింగ్ చేస్తున్నాడు, ట్రావెల్ చేస్తున్నాడు, మధ్యలో జనసైనికులని కలుస్తున్నాడు. క్షణం కూడా తీరిక లేకుండా పని చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఒప్పుకున్న సియమాలు అన్నీ తొందరగా పూర్తి చేస్తే, తాను ఇంకా రాజకీయాల మీద దృష్టి సారించవచ్చు అని అనుకుంటున్నాడు అని తెలిసింది.

ఎందుకంటే రానున్న రోజుల్లో రాజకీయాలు వేడెక్కనున్నాయి. ఎలెక్షన్స్ దగ్గర పడుతున్నాయి, రాజకీయ సమీకరణాలు మొదలవుతాయి, పర్యటనలు, నాయకుల కలయికలు, ప్రసంగాలు వీటన్నితో ఇలా చాలా బిజీ అయిపోతాడు కాబట్టి ఇప్పుడు సినిమాలు పూర్తి చెయ్యాలన్న సంకల్పంతో వున్నాడు పవన్ కళ్యాణ్. అందుకే అన్ని సినిమా నిర్వాహకులు తమ షూటింగ్ షెడ్యూల్ ని, లొకేషన్స్ అన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటున్నారు.

Updated Date - 2023-05-09T21:17:22+05:30 IST