సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pawan Kalyan: ఫ్యాన్స్ ను ఇలా రెచ్చగొట్టడం నీకు తగునా పవన్

ABN, Publish Date - Jul 25 , 2025 | 04:44 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులను రెచ్చగొడుతున్నాడా.. ? అంటే నిజమే అనే మాట వినిపిస్తుంది.

Pawan Kalyan

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులను రెచ్చగొడుతున్నాడా.. ? అంటే నిజమే అనే మాట వినిపిస్తుంది. సోషల్ మీడియా రాకముందు హీరోల మధ్యనే కాదు.. అభిమానుల ఒక సఖ్యత ఉండేది. ఒక హీరో అభిమానులను మరొకరు గౌరవించేవారు. సోషల్ మీడియా వచ్చాక ఆ పద్దతే మారిపోయింది. ప్రస్తుతం ఫ్యాన్స్ వార్స్ ఎలా ఉంటున్నాయో అందరికీ తెల్సిందే. సినిమాని సినిమాలాగా చూసి.. హీరోను హీరోలాగా అభిమానించే అభిమానులు లేరిప్పుడు. ఆగ్రహం, ఉద్రేకం, ఉడుకు రక్తంతో మా హీరోను ఏదైనా అంటే తలలు తెగాల్సిందే అని నిర్మొహమాటంగా సవాలులు విసురుతున్నారు.


ఇక అలాంటి అభిమానులను ఆపాల్సిన అవసరం హీరోల బాధ్యత అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. అయితే ఈ జనరేషన్ కుర్రాళ్ళు ఎంతలా మారిపోయారు అంటే తమ అభిమాన హీరో చెప్పినా కూడా వైన్ పరిస్థితిల్లో లేరు. కానీ, తమ్ అభిమాన హీరోలు రెచ్చిపొమ్మంటే మాత్రం అస్సలు ఆగరు. ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ అలానే ఉన్నారు. తాజాగా పవన్ నటించిన హరిహర వీరుమల్లు సినిమా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తున్న విషయం తెల్సిందే. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మించాడు.


తాజాగా హరిహర వీరమల్లు ప్రెస్ మీట్ లో పవన్ తన అభిమానులకు స్మూత్ గా ఉండకండి అని చెప్పుకొచ్చాడు. ' నా సినిమాను బాయ్ కాట్ చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు నేను భయపడను. నాకున్న దైర్యం నా అభిమానులే. ఎంత ఎదిగానో నాకు తెలియదు. కానీ,,మీరే నా బలం. నేనెప్పుడూ కుంగిపోయి కనిపించాలనుకొను. నిలబడి జీవించాలి. ఈ విషయం నా అభిమానులకు కూడా చెప్తాను. ఎందుకంటే వారు మరి సున్నితంగా కనిపిస్తున్నారు. మీరు మరీ అంత సున్నితంగా ఉండకండయ్యా. మీకు దమ్ముంటే ట్రిలిగి కొట్టండి. ఎలా దాడి చేయాలో అలా దాడి చేయండి' అంటూ చెప్పుకొచ్చాడు.


ఇక పవన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక హీరో అయ్యి ఉండి.. అభిమానులకు ఇలా చెప్పొచ్చా.. ఇప్పటికే చాలామంది సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. పవన్ వ్యాఖ్యలు వారికి ఆజ్యం పోసినట్లు ఉంటాయి. ఇది నీకు తగునా పవన్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే పవన్ మాత్రం కేవలం సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను తిప్పి కొట్టమనే ఉద్దేశ్యంతోనే అన్నాడని పవన్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ విషయం ఇక్కడితో ఆగుతుందో లేదో చూడాలి.

NTR: 'వార్ 2'.. హృతిక్ నే డామినేట్ చేసిన ఎన్టీఆర్

Nandamuri Balakrishn - Krish: మరోమారు క్రేజీ కాంబో...

Updated Date - Jul 25 , 2025 | 04:47 PM