NTR: 'వార్ 2'.. హృతిక్ నే డామినేట్ చేసిన ఎన్టీఆర్

ABN , Publish Date - Jul 25 , 2025 | 03:18 PM

ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు అంటే పాత్ర ఎంతవరకు డిమాండ్ చేస్తుందో అంతవరకు మాత్రమే చూపించేవారు. దానివలన ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ.. ఒకరు డామినేట్ చేశారు..

War 2

NTR: ఒకప్పుడు మల్టీస్టారర్ సినిమాలు అంటే పాత్ర ఎంతవరకు డిమాండ్ చేస్తుందో అంతవరకు మాత్రమే చూపించేవారు. దానివలన ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ.. ఒకరు డామినేట్ చేశారు.. ఇంకొకరు నిడివి తగ్గించేశారు లాంటి మాటలు వినిపించేవి కాదు. జనరేషన్ మారేకొద్దీ అభిమానుల్లో ఇలాంటి చర్చలు ఎక్కువ అయిపోతున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒక సినిమాలో కనిపించడమే విశేషం అనుకుంటున్న రోజుల్లో ఇద్దరు హీరోలకు కథ సమానంగా ఉండాలి. ఒక హీరోకు ఫైట్స్ ఎన్ని ఉంటే.. ఇంకో హీరోకు అన్ని ఫైట్స్ ఉండాలి. ఒక హీరోకు కథలో ఎంత నిడివి ఉందో.. మరో హీరోకు కూడా అంతే స్క్రీన్ ప్రెజెన్స్ ఇవ్వాలి. లేకపోతే ఆ హీరో అభిమానులు ససేమిరా ఒప్పుకోరు. దీంతో ఇద్దరు స్టార్ హీరోలతో ఒక సినిమా చేయడం అంటే దర్శకుడుకు కత్తిమీద సాములా మారింది.


ఇక అలాంటి కత్తిమీద సాములాంటి పనిని అలవోకగా చేసేశాడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్ని రికార్డులను బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంత పకడ్బందీగా చేసినా కూడా జక్కన్నకు ఫ్యాన్స్ నుంచి ట్రోల్స్ తప్పలేదు. చరణ్ ను ఎక్కువ చూపించాడని, ఎన్టీఆర్ ను తక్కువ చూపించాడని.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ .. జక్కన్నపై ఫైర్ అయ్యారు కూడా. వారిద్దరి పాత్రలు సమానంగానే డిజైన్ చేసాను అని చెప్పినా కూడా వారు వినలేదు. అలా అలా ఆర్ఆర్ఆర్ వివాదం ముగిసింది.


ఆర్ఆర్ఆర్ తరువాత అంతే హైప్ తో వస్తున్న మరో మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న వార్ 2 పైనే ప్రస్తుతం ఇండస్ట్రీ కళ్లన్నీ ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై అంచనాలను పెంచేసాయి. ఇక ఇప్పుడు ట్రైలర్ చూశాకా.. అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. జక్కన్న చేసిన తప్పు అయాన్ చేయలేదనిపిస్తుంది. ఇద్దరు హీరోలు ఉంటే.. వారిద్దరికీ సరిసమానమైన స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు డైలాగ్స్ ను కూడా పెట్టి కట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది.


ఇక వార్ 2 ను అనౌన్స్ చేసిన దగ్గరనుంచి హృతిక్ వర్సెస్ ఎన్టీఆర్ ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. ట్రైలర్ రిలీజ్ తరువాత లెక్కలు తారుమారు అయ్యాయి అని చెప్పొచ్చు. మొదట హృతిక్.. ఎన్టీఆర్ ను డామినేట్ చేస్తాడు అని ట్రోల్ చేసినవారే ట్రైలర్ చూసాక ఎన్టీఆరే హృతిక్ ను డామినేట్ చేసేలా కనిపిస్తున్నాడే అని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ యాక్టింగ్.. హృతిక్ తో కనిపించిన ప్రతి సన్నివేశంలో ఎన్టీఆర్ తానేంటో నిరూపించుకోవడానికే ఎంతో కసితో చేసినట్లు కనిపించాడు. కొన్ని సీన్స్ లో ఫ్యాన్స్ చెప్పినట్లే హృతిక్ ను డామినేట్ చేసినట్లే కనిపించాడు.


అయితే ఈ ట్రైలర్ లో ప్లస్ లు మాత్రమే కాదు కొన్ని మైనస్ లు కూడా ఉన్నాయని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మొదట ఎన్టీఆర్ లుక్ అంత సెట్ అవ్వలేదని కామెంట్స్ చేస్తున్నారు. హెయిర్ స్టైల్ వలన లుక్ మొత్తం మారినట్లు కనిపిస్తుంది. ఇక దీంతో పాటు ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఒకటి ట్రోల్ కు గురవుతుంది. హృతిక్ లాంటి బాడీ పక్కన ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఏ మూలకు పనికొస్తుంది. అది కూడా ఈ సిక్స్ ప్యాక్ ఏదో ఎడిట్ చేసినట్లు కనిపిస్తుంది. ముఖం మొత్తం ఒకలా ఉంటే.. బాడీ వేరేలా ఉంది. ఈ సినిమాలో అసలు ఎన్టీఆర్ షర్ట్ విప్పాల్సిన అవసరం ఉందా.. ? లేక ఎన్టీఆర్ ను ట్రోల్ చేయడానికి ఆ సీన్ ను పెట్టారా..? అనే అనుమానం రాక మానదు.


మొత్తానికి వార్ 2.. ఇద్దరు సైనికుల మధ్య యుద్ధం అని అనడం కన్నా ఇద్దరు స్టార్ హీరోల మధ్య యుద్ధం అని చెప్పొచ్చు. లుక్ పరంగా హృతిక్ ను కొట్టేవారు లేరు. వార్ 2 లో కూడా అలాగే కనిపించాడు. ఎన్టీఆర్ లుక్ లో కొన్ని లోపాలున్నా.. నటనలో అతడిని కొట్టేవారు లేరు. ఇక ఇద్దరికీ సమ ప్రాధాన్యత ఇచ్చి.. అయాన్ తెలుగు అభిమానుల ఆగ్రహం నుంచి తప్పించుకున్నాడు. ట్రైలర్ వరకు ఇది ఓకే.. సినిమాలో ఏ చిన్న తేడా వచ్చినా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉగ్రరూపం దాలుస్తారు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మరి వార్ 2.. ఎవరికి వార్ వన్ సైడ్ అయ్యేలా చేస్తుంది. ఎవరు ఎవరిని డామినేట్ చేసి ఉంటారు అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగక తప్పదు.

Fahadh Faasil: సినిమాలు ఇక చాల్లే.. చూడలేకపోతున్నాం

Rajya Sabha Member: రాజ్యసభ సభ్యునిగా కమల్ హాసన్...

Updated Date - Jul 25 , 2025 | 03:31 PM