సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kathakeli: కొత్త‌గా.. ఓ రెండు తార‌లే! చిత్ర‌మ్మ.. పాడిన కొత్త‌ తెలుగు పాట‌

ABN, Publish Date - Dec 15 , 2025 | 05:47 PM

శ‌త‌మానంభ‌వ‌తి ఫేమ్ స‌తీశ్ వేగేశ్న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించిన చిత్రం క‌థాకేళి.

Kathakeli

శ‌త‌మానంభ‌వ‌తి ఫేమ్ స‌తీశ్ వేగేశ్న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో శ‌త‌మానం భ‌వ‌తి ఆర్ట్స్ (Satamaanambhavati Arts) బ్యాన‌ర్‌పై నిర్మించిన చిత్రం క‌థాకేళి (Kathakeli). యశ్విన్ వేగేశ్న (Yashwin Vegesna), ఈషారెబ్బా (Eesha Rebba) లీడ్ రోల్స్ లో న‌టించారు. హ‌ర్ర‌ర్ నేప‌థ్యంలో 1980ల‌లో జ‌రిగే క‌థ‌గా రూపొందిన ఈ చిత్రం రెండేండ్ల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకోగా ఇప్పుడు విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఈ ఇటీవ‌ల విడుద‌ల చేసిన పాట‌లు మంచి ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోగా తాజాగా.. కొత్త‌గా.. ఓ రెండు తార‌లే (Kottagaa O Rendu Taarale Lyrical Video) అంటూ సాగే సోల్ ఫుల్ మెలోడీ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఎస్కే బాల‌చంద్ర‌న్ (SK Balachandran) సంగీతం అందించిన ఈ పాట‌కు శ్రీమ‌ణి సాహిత్రం అందించ‌గా లెజెండ్ సింగ‌ర్ చిత్ర (Chitra) చాలా రోజుల త‌ర్వాత తెలుగులో ఈ పాట పాడ‌డం విశేషం.

చిత్రయూనిట్‌ సోమవారం ఈ పాటను సోషల్‌ మీడియా ద్వారా విడుదల చేసింది. కాగా పాట వింటున్నంత సేపు హాయిగా ఉండి చాలా రోజుల నుంచి మ‌నం మిస్ అయిన మ్యాజిక్‌ను తిరిగి పొందిన ఫీల్ వ‌చ్చిన‌ట్లు అద్భుతంగా ఉంది. ఈ పాట అజ‌య్ (Ajay), అనన్య (Ananya Nagalla)ల‌పై చిత్రీక‌రించారు. ఇంకా ఈ చిత్రంలో బాలాదిత్య‌, అన‌న్య నాగ‌ళ్ల‌, పూజిత పొన్నాడ (Pujita Ponnada), నందినీ రాయ్‌, పూజా ఘ‌వేరి, అజ‌య్ కుమార్‌, భాను శ్రీ, ర‌చ్చ ర‌వి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

Updated Date - Dec 15 , 2025 | 05:47 PM