సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

OG Movie: వాషి యో వాషి తెలుగు అర్ధం తెలిసిపోయిందోచ్

ABN, Publish Date - Sep 21 , 2025 | 06:06 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రియాంక మోహన్ జంటగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఓజీ (OG).

OG Movie

OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ప్రియాంక మోహన్ జంటగా సుజీత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఓజీ (OG). ఈ సినిమా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు. ఇక ఈ మధ్యనే ఈ చిత్రం నుంచి వాషి యో వాషి అనే జపాన్ హైకూను రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. సుజీత్ రాసిన ఈ హైకూను పవన్ ఆలపించాడు.


ఇక జపాన్ రాకపోయినా కూడా ఫ్యాన్స్.. ఎలా అయినా ఆ లిరిక్స్ కు అర్ధం తెలుసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ సాంగ్ కింద ఇంగ్లిష్ లో దానికి అర్ధం చెప్పుకొచ్చారు. దానినితెలుగులోకి అనువదించి ఎట్టకేలకు తెలుగు అర్దాన్ని కనిపెట్టేసారు ఫ్యాన్స్. ఈ హైకూ చెప్పడానికి ముందు పవన్.. ఇమ్రాన్ హష్మికి ఒక వార్నింగ్ ఇస్తాడు. ఓమీ.. ఓ మై డియర్ ఓమీ, ఎగెరెగిరి పడుతున్నావ్. నీలాంటివాడిని ఎలా నేలమీదకు దించాలో నాకు బాగా తెలుసు. చిన్నప్పుడు నా గురువు చెప్పిన హైకూ చెప్తాను విను అంటూ వాషి యో వాషి మొదలుపెడతాడు.


ఇక ఈ హైకూకు తెలుగులో అర్ధం ఏంటంటే..

' గద్దా.. ఓ గద్దా

నువ్వో అడివి గద్దను చంపాలనుకుంటే

మొదట నువ్వు దాని రెక్కలు తెగ నరకాలి

అది నేలమీద పడ్డాక దాని కళ్లు పీకేయాలి

ఒకసారి అది గుడ్డిది అయ్యాకా.. అది ఎటు పోవడానికి ఉండదు

అప్పుడు దాని కాళ్లు నరికితేఇక ఎక్కడికి కదల్లేదు

అప్పుడు దాని రాకాసి గుండెను బయటకు లాగాలి

గద్దా.. ఓ గద్దా'

ఇది ఆ హైకూకు మీనింగ్. అంటే ఇలానే ఓజీ.. ఓమీని నాశనం చేస్తానని స్వీట్ గా వార్నింగ్ ఇచ్చాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ హైకూ మీనింగ్ నెట్టింట వైరల్ గా మారింది.

Pawan Kalyan OG: ఓజీ టికెట్‌ రూ.1,29,999..! ఇదెక్క‌డి.. అభిమానం రా నాయ‌నా

Kotha Lokah: లోక ఓటీటీ రిలీజ్.. దుల్కర్ ఏం చెప్పాడంటే

Updated Date - Sep 21 , 2025 | 06:06 PM