OG Movie: ఫ్యాన్స్ ఓపిక పట్టండి.. ట్రైలర్ వచ్చేస్తుంది
ABN, Publish Date - Sep 18 , 2025 | 03:16 PM
నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా.. డెత్ కోటా.. కన్ఫర్మ్ అంట ప్రస్తుతం సోషల్ మీడియాను ఇవే లైన్స్ ఏలుతున్నాయి. ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా ఓజీ (OG)..
OG Movie: నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా.. డెత్ కోటా.. కన్ఫర్మ్ అంట ప్రస్తుతం సోషల్ మీడియాను ఇవే లైన్స్ ఏలుతున్నాయి. ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా ఓజీ (OG).. ఓజీ అనే పేరు తప్ప ఇంకేదీ వినిపించడం లేదు. కనిపించడం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా కుర్ర డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఓజీ. డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
ఓజీ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. వీరితో పాటు దిగ్గజ నటులు ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై హైప్ ను కూడా క్రియేట్ చేశాయి. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఓజీ ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూ లతో బిజీ అయ్యారు. అయితే ఇప్పటివరకు ఓజీ ట్రైలర్ రిలీజ్ కాకపోవడంతో.. ట్రైలర్ రిలీజ్ చేయమని ఫ్యాన్స్.. మేకర్స్ పై మండిపడుతున్నారు. మాకు ఓజీ ట్రైలర్ కావాలంటూ ఎక్స్ లో ట్రెండ్ చేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ ఆవేశాన్ని గ్రహించిన మేకర్స్.. ఎట్టకేలకు ఓజీ ట్రైలర్ డేట్ ను అనౌన్స్ చేసారు. సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటల 08 నిమిషాలకు ట్రైలర్ రానుందని తెలుపుతూ ఒక కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. అంతే కాకుండా డెత్ కోట.. కన్ఫర్మ్ అంట అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. అంటే ఇంకో రెండు రోజులు ఫ్యాన్స్ ఓపిక పడితే.. ఓజీ ట్రైలర్ వచ్చేస్తుంది. మరి ఈ ట్రైలర్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
Nandamuri Balakrishna: చివరి పాట చిత్రీకరణలో 'అఖండ -2'
Deepika Padukone.: అల్లు అర్జున్ సినిమానే కారణమా...