Allu Sirish: పెళ్లి పీటలు ఎక్కనున్న అల్లు హీరో
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:55 PM
అల్లు వారింట పెళ్లి బాజాలు మోగనున్నాయా అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. అల్లు వారి చిన్న వారసుడు అల్లు శిరీష్ (Allu Sirish) పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి.
Allu Sirish: అల్లు వారింట పెళ్లి భాజాలు మోగనున్నాయా అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. అల్లు వారి చిన్న వారసుడు అల్లు శిరీష్ (Allu Sirish) పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. అల్లు అరవింద్ (Allu Aravind) కు ముగ్గురు కొడుకులు. బాబీ, బన్నీ, శిరీష్. బాబీ, బన్నీకి పెళ్లిళ్లు అయ్యాయి.. పిల్లలు కూడా ఉన్నారు. ఇక చిబారగా అల్లు వారింట జరిగే పెళ్లి శిరీష్ దే.
అల్లు అర్జున్ హీరోగా సెట్ అయ్యాక ఆ ఇంటి నుంచి గౌరవం అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు శిరీష్. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయినా మంచి అవకాశాలను తీసుకొచ్చిపెట్టింది. అయితే శిరీష్ మాత్రం అన్న అంత ఎత్తుకు ఎదగలేకపోయాడు. అడపదడపా సినిమాలు చేస్తున్నా హీరోగా నిలదొక్కుకోలేకపోతున్నాడు. ఇక గతేడాది బడ్డీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, అది కూడా అంతగా వర్క్ అవుట్ అవ్వలేదు.
ఇక అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అరవింద్.. శిరీష్ కు వివాహాం చేయాలనీ నిర్ణయించుకున్నారట. ఒక ప్రముఖ బిజినెస్ మ్యాన్ కుమార్తెతో శిరీష్ కు పెళ్లి చేయాలనీ నిర్ణయించడం.. ఇరు కుటుంబాలు మాట్లాడుకోవడం కూడా జరిగాయట. కానీ, ఈలోపే అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నం మరణించడంతో ఈ పెళ్ళికి కొద్దిగా బ్రేకులు పడ్డాయని తెలుస్తోంది. ఇక ఇప్పుడు మళ్లీ శిరీష్ పెళ్లి పనులు మొదలయ్యాయని, త్వరలోనే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ కు ముహూర్తం పెట్టనున్నారని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముంది అనేది తెలియాల్సి ఉంది.
OG Mania: 'ఓజీ' థీమ్ హుడీతో మెస్మరైజ్
Siddu Jonnalagadda: మగాడి విషయంలో సొసైటీ అన్యాయంగా ప్రవర్తిస్తుంది