NTR: బావమరిది పెళ్లి.. హంగామా అంతా బావదే

ABN , Publish Date - Oct 10 , 2025 | 09:26 PM

ఈ ఏడాది టాలీవుడ్ లో ఉన్న సగం మంది బ్యాచిలర్స్.. పెళ్లిపీటలు ఎక్కారు. కొందరికి నిశ్చితార్దాలు అవ్వగా.. ఇంకొందరు ఎంచక్కా పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారయ్యారు

NTR

NTR: ఈ ఏడాది టాలీవుడ్ లో ఉన్న సగం మంది బ్యాచిలర్స్.. పెళ్లిపీటలు ఎక్కారు. కొందరికి నిశ్చితార్దాలు అవ్వగా.. ఇంకొందరు ఎంచక్కా పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారయ్యారు. అందులో నార్నె నితిన్ కూడా యాడ్ అయ్యాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు నితిన్. ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తమ్ముడే నార్నె నితిన్. శ్రీశ్రీశ్రీ రాజావారు సినిమాతో ఎంట్రీ ఇచ్చినా .. దానికన్నా ముందు మ్యాడ్ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకోవడంతో మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న గుర్తింపు తెచ్చుకున్నాడు.


మ్యాడ్ తరువాత ఆయ్, మ్యాడ్ స్క్వేర్ తో హీరోగా ఒక మాదిరిగా నిలబడ్డాడు . ఇక దీంతో వెంటనే పెద్దలు నితిన్ కు పెళ్లి చేయాలని ప్లాన్ చేశారు. దగ్గుబాటి వెంకటేష్ కు దగ్గరి బంధువులు అయిన తాళ్లూరి వెంకట కృష్ణ ప్రసాద్, స్వరూపల కుమార్తె అయిన శివాని తాళ్లూరితో నార్నె నితిన్ పెళ్లి జరిపించాలని పెద్దలు నిశ్చయించి గతేడాది వీరి నిశ్చితార్దాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు.


ఇక నేడు నితిన్ - శివానిల వివాహం ఘనంగా జరగనుంది. హైదరాబాద్ శివారులోని శంకర్ పల్లిలో వీరి వివాహం మరికొద్దిసేపటిలో జరగనుంది. బావమరిది పెళ్లి హడావిడి మొత్తం బావ ఎన్టీఆర్ తన భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. అక్క ప్రణతి, బావ ఎన్టీఆరే కళ్యాణమండపంలో అందరినీ ఆహ్వానిస్తూ కనిపించారు. ఇక ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉంది. గుబురు గడ్డం, స్లిమ్ పర్సనాలిటీతో ఎంతో అందంగా కనిపించాడు. డ్రాగన్ సినిమా కోసం మెయింటైన్ చేస్తున్న లుక్ లా కనిపిస్తుంది. పెళ్లి కొడుకు నితిన్ లైట్ పింక్ కలర్ షేర్వాణీలో మెరవగా.. పెళ్లికూతురు శివాని రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ పట్టుచీరలో ఎంతో అందంగా కనిపించింది. ఈ పెళ్ళికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Trisha Krishnan: హనీమూన్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాను

Anupama Parameswaran: కుర్ర హీరోతో.. అనుపమ డేటింగ్! నిజమేనా

Updated Date - Oct 10 , 2025 | 09:26 PM