Trisha Krishnan: హనీమూన్ షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నాను
ABN , Publish Date - Oct 10 , 2025 | 08:57 PM
ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పైకి కనిపించేవి ఏవి నిజం కాదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే అస్సలు కాదు.
Trisha Krishnan: ఇండస్ట్రీ.. ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ పైకి కనిపించేవి ఏవి నిజం కాదు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే అస్సలు కాదు. వారిపై వచ్చే పుకార్లు అయితే నమ్మడమే చాలా కష్టం. ఈ రూమర్స్ ను కొందరు హీరోయిన్లు సీరియస్ గా తీసుకొని కుమిలి కుమిలి ఏడుస్తారు. ఇంకొందరు మాత్రం ఎంచక్కా నవ్వుకొని.. తిరిగి వాటిపై సెటైర్లు కూడా వెస్తూ ఉంటారు. స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రస్తుతం అలాంటి సెటైర్ నే వేసింది. తన పెళ్లిపై వస్తున్న పుకార్లను ఒక్క సెటైరికల్ పోస్ట్ తో చెక్ పెట్టింది.
వర్షం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది త్రిష. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని తెలుగులో వారు వీరు అని తేడా లేకుండా అందరి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక కొత్త హీరోయిన్లు రావడంతో ఉన్నప్పుడే ముద్దగుమ్మ నెమ్మదిగా ఇండస్ట్రీ నుంచి తప్పుకుంది. ఆ తరువాత తమిళ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ గా ఛాయిస్ గా మారింది. చాలా గ్యాప్ తరువాత త్రిష విశ్వంభర సినిమాతో టాలీవుడ్ లో రీఎంట్రీ ఇస్తుంది.
ఇక త్రిష పెళ్లి ఎప్పుడు మిస్టరీనే అని చెప్పొచ్చు. గతంలో ఒక బిజినెస్ మ్యాన్ తో ఎంగేజ్ మెంట్ జరుపుకొని పెళ్లి కొన్ని రోజుల్లో ఉంది అనుకొనేలోపు రద్దు చేసుకుంది. అప్పటి నుంచి సింగిల్ గా ఉంటున్న త్రిష.. ఈ మధ్యనే హీరో విజయ్ తో ప్రేమాయణం నడుపుతుందని వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి కనిపించడం ఆ వార్తలు నిజమే అని అనుకునేలా చేశాయి. అయితే ఈలోపే త్రిషకు చండీఘడ్ కు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ తో పెళ్లి కుదిరింది అన్న వార్త కోలీవుడ్ ను షేక్ చేసింది. ఇరువర్గాల కుటుంబాలు కూడా మాట్లాడుకొని త్వరలోనే పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.
తాజాగా తన పెళ్లి వార్తలపై త్రిష స్పందించింది. పెళ్లి లేదు ఏమి లేదు అని స్ట్రైట్ గా చెప్పకుండా సెటైరికల్ గా నా పెళ్లిపై వీరి ఇంట్రెస్ట్ ఏంటో అన్నట్లు చెప్పుకొచ్చింది. ' నా కోసం నా జీవితాన్ని ప్లాన్ చేసేవారిని నేను ప్రేమిస్తాను. నా హనీమూన్ షెడ్యూల్ ను కూడా ఎప్పుడు ప్లాన్ చేస్తారా అని ఎదురుచూస్తున్నాను' అంటూ రాసుకొచ్చింది. ఈ ఒక్క పోస్ట్ తో అమ్మడు పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ చిన్నది ఇప్పట్లో పెళ్లి చేసుకుంటుందా.. ? లేదా అనేది చూడాలి.
Anupama Parameswaran: కుర్ర హీరోతో.. అనుపమ డేటింగ్! నిజమేనా
Deepika Padukone: కల్కి నుంచి అవుట్.. ఎట్టకేలకు నోరువిప్పిన దీపికా