Anupama Parameswaran: కుర్ర హీరోతో.. అనుపమ డేటింగ్! నిజమేనా
ABN , Publish Date - Oct 10 , 2025 | 08:21 PM
ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమాయాణాలు సర్వ సాధారణం. కొందరు నిజంగా ప్రేమించుకొని.. ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తారు.
Anupama Parameswaran: ఇండస్ట్రీలో హీరోహీరోయిన్ల మధ్య ప్రేమాయాణాలు సర్వ సాధారణం. కొందరు నిజంగా ప్రేమించుకొని.. ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తారు. మరికొందరు మధ్యలోనే బ్రేకప్ లు చెప్పుకొని వేరొకరిని పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇకతాజాగా కోలీవుడ్ లో ఒక కొత్త ప్రేమ జంట మీడియా కంటపడింది. వారే అందాల భామ అనుపమ పరమేశ్వరన్, కుర్ర హీరో ధృవ్ విక్రమ్.
స్టార్ హీరో విక్రమ్ నట వారసుడిగా ధృవ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆదిత్య వర్మ, మహాన్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన ధృవ్ చాలా గ్యాప్ తరువాత బైసన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ధృవ్ సరసన అనుపమ నటిస్తోంది. ఈ సినిమా సెట్ లోనే వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారిందని రూమర్స్ పుట్టుకొచ్చాయి. ఆ రూమర్స్ ను నిజం చేస్తూ ఈ మధ్యనే వీరిద్దరి లిప్ లాక్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేసింది.
ఇప్పటివరకు అనుపమ కానీ , ధృవ్ కానీ ఆ ఫోటో గురించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా బైసన్ సాంగ్ లాంచ్ వేడుకలో అనుపకు డైరెక్ట్ డేటింగ్ ప్రశ్ననే ఎదురయ్యింది. మీరు డేటింగ్ లో ఉన్నారట నిజమేనా అన్న ప్రశ్నకు అమ్మడు సిగ్గు పడుతూ తెలివిగా తప్పించుకుంది. ధృవ్ పనితనం గురించి మాట్లాడుతూ టాపిక్ ను డైవర్ట్ చేసింది. అదే వేడుకలో ధృవ్ ను అనుపమ టైట్ హాగ్ ఇవ్వడం, అతని పేరు చెప్పినప్పుడు సిగ్గుపడడం చూస్తుంటే నిజంగానే వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అని కోలీవుడ్ మొత్తం గుసగుసలాడుతుంది. మరి త్వరలోనే ఈ జంట ఏదైనా గుడ్ న్యూస్ చెప్తుందేమో చూడాలి.
Saturday TV Movies: శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో వచ్చే సినిమాలివే
Anil Ravipudi: ప్రమోషన్స్‌లో.. అనిల్ రూటే సపరేటూ