Hansika Motwani: విడాకులు కన్ఫర్మ్.. పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన హన్సిక

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:51 AM

ఇండస్ట్రీలో ఈ ప్రేమలు, పెళ్లిళ్లు ఎవరెవరు ఎప్పుడు చేసుకుంటున్నారు.. అసలు ఎందుకు విడిపోతున్నారు అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది.

Hansika

Hansika Motwani: ఇండస్ట్రీలో ఈ ప్రేమలు, పెళ్లిళ్లు ఎవరెవరు ఎప్పుడు చేసుకుంటున్నారు.. అసలు ఎందుకు విడిపోతున్నారు అనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. 20 ఏళ్లు కలిసి ఉన్న సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతున్నారు.. ఎన్నో ఆశలతో ప్రేమించి పెళ్లి చేసుకొని మూడేళ్లు కూడా కలిసి లేకుండా విడాకులు తీసుకొని విడిపోతున్నారు. తాజాగా బబ్లీ బ్యూటీ హన్సిక మోత్వానీ (Hansika Motwani) సైతం తన భర్తకు విడాకులు ఇవ్వడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది.


అందాల భామ హన్సిక బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టి.. తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కుర్ర హీరోల సరసన నటించి మెప్పించింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హన్సిక.. తన ఫ్రెండ్ భర్త అయిన సోహైల్ కతూరియాను వివాహమాడింది. 2022 లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అంతేకాకుండా వీరి పెళ్లి డాక్యుమెంటరీ హన్సికస్ లవ్ షాదీ డ్రామా పేరుతో జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కూడా అయ్యింది. ఆ డాక్యుమెంటరీలో హన్సిక.. సోహైల్ తో తన ప్రేమ.. పెళ్లి అయ్యినవాడిని ప్రేమించినందుకు తనను ఇంట్లో ఎంతలా అవమానించాచారో అన్ని చెప్పుకొచ్చింది.


హన్సిక - సోహైల్ పెళ్లి తరువాత అభిమానులు సైతం మంచి జంట.. జీవితాంతం కలిసి ఉండాలని కోరుకున్నారు. అయితే ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంతకాలం ఉంటాయో వారికే తెలియదు. గత కొన్నిరోజులుగా హన్సిక తన భర్త సోహైల్ తో విడిపోయి ఉంటుందని, వీరిద్దరూ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో హన్సిక పుట్టింటికి వెళ్లిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే అప్పట్లో ఈ వార్తలను సోహైల్ ఖండించాడు. అలాంటిదేమి లేదని, అవన్నీ తప్పుడు వార్తలు అని చెప్పుకొచ్చాడు. కానీ హన్సిక మాత్రం ఈ వార్తలపై స్పందించింది లేదు.


తాజాగా హన్సిక విడాకులు కన్ఫర్మ్ చేసింది. ఈమధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ లో పెళ్లి ఫోటోలను డిలీట్ చేసి తాము విడిపోతున్నట్లు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు హన్సిక కూడా అదే పని చేసింది. తన భర్త సోహైల్ తో కలిసి ఉన్న ఫోటోలను మొత్తం డిలీట్ చేసింది. మొట్ట మొదటిసారి సోహైల్.. ప్రపోజ్ చేసిన ఫోటో దగ్గరనుంచి పెళ్ళికి సంబంధించిన ఎలాంటి ఫోటోను మిగల్చకుండా తీసిపడేసింది. దీంతో హన్సిక - సోహైల్ కచ్చితంగా విడిపోయినట్టే అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలియడంతో ఈ జంట వివాహ వేడుక మూడునాళ్ల ముచ్చటగానే మారిందని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

The Girlfriend: సింగర్ ను డిన్నర్ కు పిలుస్తానంటున్న రశ్మిక...

Jurassic World Rebirth OTT: స‌డ‌న్‌గా ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్! కానీ వారికి మాత్ర‌మే

Updated Date - Aug 05 , 2025 | 11:51 AM