NTR: ఎన్టీఆర్ మార్ఫింగ్ వీడియోలు.. సజ్జనార్ ను ఆశ్రయించిన ఫ్యాన్స్
ABN, Publish Date - Oct 22 , 2025 | 07:40 PM
సోషల్ మీడియా వచ్చాకా ట్రోల్స్ కు కొదువే లేదు. ముఖ్యంగా హీరోల ఫ్యాన్ వార్స్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు.
NTR: సోషల్ మీడియా వచ్చాకా ట్రోల్స్ కు కొదువే లేదు. ముఖ్యంగా హీరోల ఫ్యాన్ వార్స్ గురించి అయితే అస్సలు చెప్పనవసరం లేదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని కొట్టేసుకుంటున్నారు. అక్కడితో ఆగితే పర్వాలేదు. పర్సనల్ ఎటాక్ చేస్తున్నారు. కుటుంబాలను, భార్యాపిల్లలను తీసుకొచ్చి వారిపై అసభ్యకరమైన కామెంట్స్ చేసి తమ అభిమానాన్ని నిరూపించుకుంటున్నారు. హీరోల ఫోటోలను మార్ఫింగ్ చేసి అమ్మాయిల బాడీలకు హీరోల ఫోటోలను అతికించి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మార్ఫింగ్ వీడియోలను పోస్ట్ చేస్తూ కొంతమంది ట్రోల్స్ చేస్తున్నారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ, ఈసారి మరీ దారుణంగా ట్రోల్స్ రావడంతో ఎన్టీఆర్ అభిమానులు మండిపడ్డారు. ఏకంగా ఈ మార్ఫింగ్ ఫొటోస్, వీడియోస్ పై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఎన్టీఆర్ అభిమానుల సంఘం అధ్యక్షుడు నందిపాటి మురళీ.. సీపీ వీసీ సజ్జనార్ ను కలిసి ఫిర్యాదును అందించాడు. ఎన్టీఆర్ పరువు తీయడానికి కొందరు కావాలనే ఈ వీడియోలు చేస్తున్నారని, ఎన్టీఆర్ పై వస్తున్న మార్ఫింగ్ వీడియోలు, ఫొటోస్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వెంటనే వాటన్నింటిని డిలీట్ చేయించాలని, ఫిర్యాదులో కోరాడు.
నందిపాటి మురళీ ఫిర్యాదును స్వీకరించిన సజ్జనార్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఎన్టీఆర్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా గురించి కూడా పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నీల్ కి ఎన్టీఆర్ కి గొడవలు జరిగాయని, దాని కారణంగా డ్రాగన్ ఆగిందని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
Kaantha: అమ్మడివే సాంగ్.. మహానటిని గుర్తు చేస్తుందేంటి
Shiva Rajkumar: వెండితెరపై ప్రజానాయకుడి జీవితం...