Nitiin: శ్రీను వైట్లతో నితిన్ కొత్త సినిమా..
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:53 PM
కుర్ర హీరో నితిన్ (Nithiin) ప్రస్తుతం ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు.
Nitiin: కుర్ర హీరో నితిన్ (Nithiin) ప్రస్తుతం ఒక మంచి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. కొన్నేళ్లుగా నితిన్ సినిమాలు చేస్తూనే ఉన్నాడు కానీ, విజయాన్ని మాత్రం అందుకోలేదు. ఈ ఏడాది తమ్ముడు సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. అది కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక దీని తరువాత వేణుతో కలిసి ఎల్లమ్మ సెట్స్ మీదకు తీసుకెళ్తారేమో అనుకున్నారు. కానీ, ఎల్లమ్మ (Yellamma) నుంచి నితిన్ ఇష్టపూర్వకముగానే తప్పుకున్నాడని వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం ఎల్లమ్మ.. శర్వానంద్ చేతికి వెళ్లిందని టాక్. ఇక ఇదంతా పక్కన పెడితే.. నితిన్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి విక్రమ్ కె కుమార్ దర్శకత్వం లో చేస్తున్నాడు. ఇష్క్ లాంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్.. ఇప్పుడు నితిన్ తో మరోసారి జతకట్టనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇది కాకుండా నితిన్.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీను వైట్ల.. ప్రస్తుతం పరాజయాల మధ్య కొనసాగుతున్నాడు.గతేడాది విశ్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీను వైట్లకు పరాజయమే దక్కింది. ఇక ఇప్పుడు మంచి కథతో నితిన్ ను ఒప్పించాడని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్.. వీరిద్దరి కాంబోలో ఒక సినిమాను చేయడానికి ఒప్పుకుంది. త్వరలోనే మేకర్స్ అధికారికంగా ఈ చిత్రాన్ని ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాతో వీరిద్దరూ కమ్ బ్యాక్ ఇస్తారేమో చూడాలి.
Mohan Lal: సమస్య వస్తే దానికి అధ్యక్షుడు ఒక్కడే కారణమా..
Ashok Kumar: సినిమా షూటింగ్‌లో ప్రమాదం.. హీరోను పొడిచిన ఎద్దు