Ravi Mohan: రోజుకో మలుపు తిరుగుతున్న విడాకుల వ్యవహారం
ABN , Publish Date - May 24 , 2025 | 02:32 PM
'జయం' రవి, ఆర్తి విడాకుల వ్యవహారంపై చెన్నయ్ హైకోర్టు జోక్యం చేసుకుంది. ఇకపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేయకూడదని సూచించింది.
ప్రముఖ తమిళ నిర్మాత ఎడిటర్ మోహన్ (Editor Mohan) కుమారుడు, హీరో 'జయం' రవి (Jayam Ravi) విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. భార్య ఆర్తి (Aarti) తో ఇక కాపురం చేయలేనంటూ రవి విడాకుల కోసం కోర్టు కెక్కారు. వీరిద్దరికి కౌన్సిలింగ్ జరపాల్సింది గా కోర్టు ఆదేశించింది. అయితే... అధికారికంగా విడాకుల వ్యవహారం ఓ కొలిక్కి రాకముందే ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం మొదలు పెట్టారు. సింగర్ కెనీషా (Singer Kenisha) కారణంగానే భర్త రవి తనకు దూరమయ్యారని ఆర్తి ఆరోపణలు చేసింది. భార్య తనను పట్టించుకోలేదని, తనను ఓ కరెన్సీ మిషన్ గానే అత్తగారి తరఫు వాళ్ళు చూశారని రవి ఆరోపించాడు. అతని కారణంగా కోట్ల రూపాయలు నష్టపోయామని ఆర్తి తల్లి చెప్పగా, ఒక వేళ విడాకులు ఇస్తే నెలకు రూ. 40 లక్షల చొప్పున భరణం ఇవ్వాలని ఆర్తి కోర్టుకు విన్నవించింది. ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిపోయింది.
భార్య ఆర్తి నైజంను తెలియచేస్తూ రవి ఆ మధ్య మూడు పేజీల లేఖ రాసి, తన గోడు అభిమానులకు వెళ్లబోసుకున్నాడు. అతను తమను ఎంతగా ఇబ్బందుల పాలు చేశాడో ఆర్తి, ఆమె తల్లి ఆ తర్వాత మీడియా ముందుకు వచ్చి తెలిపారు. రోజు రోజుకూ ఈ వ్యవహారం ముదురుతుండటంతో ఇప్పుడు చెన్నయ్ హైకోర్టు ఈ విషయంలో కలగచేసుకుంది. వీరిద్దరూ ఇకపై బహిరంగంగా ఒకరి గురించి ఒకరు ఆరోపణలు చేసుకోకూడదని, అలానే మీడియాకు ఎలాంటి ప్రెస్ నోట్స్ విడుదల చేయకూడదని తెలిసింది. కోర్టులో విడాకుల వ్యవహారం పెండింగ్ లో ఉండగానే ఇలా ఎలా వారి అభిప్రాయాలను మీడియా ముందు పెడతారంటూ మందలించింది. ఈ కేసు తదుపరి విచారణ జూన్ 12న జరుగనుంది. మరి కోర్టు చివాట్లతో అయినా వీరు మౌనం పాటిస్తారో లేదో చూడాలి.
Also Read: Tollywood: సమస్యల పరిష్కారానికి కమిటీ... థియేటర్స్ బంద్ ఉండదు
Also Read: Mukul Dev: సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రభాస్, రవితేజ విలన్ కన్నుమూత
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి