Nidhhi Agerwal: బ్యాడ్ లక్ అంటే నిధి పాపదే.. పాపం
ABN, Publish Date - Sep 15 , 2025 | 10:31 PM
ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు ఇండస్ట్రీలో ఉండడం గురించి ఒక డైలాగ్ చెప్తాడు. ఇండస్ట్రీలో ఉండాలంటే గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలట.
Nidhhi Agerwal: ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు ఇండస్ట్రీలో ఉండడం గురించి ఒక డైలాగ్ చెప్తాడు. ఇండస్ట్రీలో ఉండాలంటే గుమ్మడికాయంత టాలెంట్ ఉంటే సరిపోదు.. ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలట. పాపం ప్రస్తుతం హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) గురించి ఫ్యాన్స్ అందరూ అలానే అనుకుంటున్నారు. అదృష్టం వచ్చినట్టే వచ్చి చేజారిపోతుందని. నిధి.. సవ్యసాచి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. అమ్మడి అందానికి మొదటి సినిమాకే కుర్రకారు క్యూ కట్టేశారు. ఇక ఉండిపో ఉండిపో అని ఇస్మార్ట్ శంకర్ లో అందంగా అందాలను చూపించేసరికి.. నిధి పాపనే గుండెల్లో ఉంచేసుకున్నారు.
ఇస్మార్ట్ శంకర్ హిట్ తరువాత నిధి స్టార్ హీరోయిన్ గా మారుతుంది అనుకున్నారు. కానీ, అవకాశాలు కూడా కరువయ్యాయి. అయినా పట్టువదలని లేడీ విక్రమార్కుడిలా నిధి తమిళ్, తెలుగు రెండింటిని కవర్ చేసి.. రెండు చోట్ల బొక్కబోర్లా పడింది. మధ్యలో కొద్దిగా గ్యాప్ తీసుకొని హరిహర వీరమల్లుతో వీరవిహారం చేసింది. అమ్మడి నటన, డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయితే అయ్యారు కానీ, విజయాన్ని అందించలేకపోయారు. అలా వీరమల్లు కూడా తుస్సుమంది.
ఇక వీరమల్లు పోయినా మిరాయ్ లో ఒక స్పెషల్ సాంగ్ చేశాం కదా.. అది హిట్ అయితే రేంజ్ మారిపోతుంది అని ఎన్నో అంచనాలు పెట్టుకుంది. అనుకున్నది ఒక్కటి అయ్యింది ఒక్కటి అన్నట్లు.. మీరే లో కథ డిస్టర్బ్ అవుతుందని స్పెషల్ సాంగ్ ఏంటి.. వైరల్ అయిన సాంగ్ నే తీసేశారు. దీంతో బంగారం లాంటి సాంగ్ కూడా ఎడిట్ లోకి పోయింది. అలా నిధి స్పెషల్ సాంగ్ కానరాకుండా పోయింది. మిరాయ్ లో కనుక నిధి సాంగ్ ఉండి ఉంటే.. ఈపాటికి నిధి పాప సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయేది. ఇక్కడ కూడా అమ్మడిని బ్యాడ్ లక్ వదలలేదు.
ఇక ప్రస్తుతం నిధి ఆశలన్నీ ది రాజాసాబ్ పైనే పెట్టుకుంది. ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిధి ఒక హీరోయిన్ గా నటిస్తోంది. టీజర్ చూసాక ప్రభాస్ ప్రేమించేది నిధినే అని తెలుస్తోంది. ఈ లెక్కన మెయిన్ హీరోయిన్ నిధినే అని టాక్. ఇక మాళవిక మోహనన్, రిద్ది కుమార్ ఉన్నా చాలా సైలెంట్ గా నన్ గా కనిపించి మొదటనే మార్కులు కొట్టేసింది నిధి. ఇక రాజాసాబ్ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి సిద్దమవుతుంది. ఇన్ని బ్యాడ్ లక్ లు వచ్చినా.. నిధి, రాజాసాబ్ పై ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంది. మరి ఆ సినిమా అయినా అమ్మడిని కాపాడుతుందా.. ? లేదా.. ? అనేది చూడాలి.
Tuesday Tv Movies: మంగళవారం, Sep 16.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే
Peddi: పెద్దిలో రామ్ చరణ్ తల్లిగా ఛాన్స్ పట్టేసిన అఖండ నటి