Kireeti Reddy: జూనియర్ ఎన్టీఆర్.. కిరీటికి అప్పుడే బిరుదు
ABN, Publish Date - Jul 18 , 2025 | 06:59 PM
ఇండస్ట్రీలోకి వచ్చేవారికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. చాలామంది మెగాస్టార్ చిరంజీవిని చూసి ఇండస్ట్రీకి వచ్చాం. ఆ హీరోను చూసి వచ్చాం.. ఈ హీరోను చూసి వచ్చాం అని చెప్పుకొస్తారు.
Kireeti Reddy: ఇండస్ట్రీలోకి వచ్చేవారికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. చాలామంది మెగాస్టార్ చిరంజీవిని చూసి ఇండస్ట్రీకి వచ్చాం. ఆ హీరోను చూసి వచ్చాం.. ఈ హీరోను చూసి వచ్చాం అని చెప్పుకొస్తారు. సినిమాలో వారు ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన హీరోను మరిపించే యాక్టింగ్ చేయడం అందరివలన కాదు. కానీ, మొదటి సినిమాతోనే ఆ గుర్తింపును సంపాదించుకున్నాడు హీరో కిరీటి రెడ్డి (Kireeti Reddy).
గాలి జనార్దన్ రెడ్డి తనయుడుగా జూనియర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు కిరీటి.. రాధాకృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా కనిపించగా.. జెనీలియా కీలకపాత్రలో నటించింది. ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన జూనియర్ మిక్స్డ్ టాక్ అందుకుంటుంది. అసలు వారసులుగా వచ్చిన హీరోల సినిమాల కంటే జూనియర్ మంచి పాజిటివ్ టాక్ నే అందుకుంటుంది. కథ పరంగా రొటీన్ గా ఉన్నా.. కిరీటి నటన, డ్యాన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకొస్తున్నారు.
ముఖ్యంగా కిరీటి డ్యాన్స్.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ను గుర్తుచేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వైరల్ వయ్యారి అనే మాస్ సాంగ్ రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక ఈ సాంగ్ లో కిరీటి డ్యాన్స్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఒక్కసారిగా అతని గ్రేస్, ఎనర్జీ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఒక కొత్త హీరోలా కిరీటి డ్యాన్స్ లేదు. అదే ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇక కొంతమంది కొత్త హీరోల్లా.. నోటికి ఏది వస్తే అది మాట్లాడి ట్రోల్ కూడా కాలేదు. చాలా పద్దతిగా మెచ్యూర్డ్ గా మాట్లాడి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు.
జూనియర్ సినిమా.. కిరీటికి విజయాన్ని అందిస్తుందా.. ? లేదా.. ? అనే విషయాన్నీ పక్కన పెడితే అతని కెరీర్ కి ఈ సినిమా ఒక పునాది వేసింది అని చెప్పొచ్చు. మొదటి సినిమాతోనే ట్రోల్స్ కు గురై.. రెండో సినిమా వరకు కూడా రాకుండా వెళ్ళిపోయిన వారితో పోలిస్తే కిరీటి చాలా బెటర్ అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇంకోపక్క శ్రీలీల లాంటి డ్యాన్సర్ తో పోటాపోటీగా నిలబడ్డాడు అంటే అది మామూలు విషయం కాదు. కిరీటి డ్యాన్స్ చేయడం తనకే చాలా భయంగా అనిపించిందని శ్రీలీల చెప్పడం విశేషం. ఇలా అన్ని విధాలుగా కలిసొచ్చి కిరీటిని ఇప్పుడు చాలామంది జూనియర్ ఎన్టీఆర్ అని పిలిచేస్తున్నారు. మరి ఈ పిలుపులు, బిరుదులు అనేవి ఈరోజు ఉంటాయి.. రేపు మారతాయి. కానీ, కిరీటి నటన ఇంకా మెరుగుచేసుకొని.. మంచి మంచి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తే కనుక మంచి సక్సెస్ ఫుల్ హీరో అవుతాడు అనేది కొందరి అభిప్రాయం. మరి ముందు ముందు ఈ కుర్ర హీరో ఎలాంటి కథలను ఎంచుకుంటాడు అనేది చూడాలి.
Sayli Chaudhari: సుమతీ శతకం హీరోయిన్ లుక్ అదిరింది
Tourist Family - Chhaava: చిన్న సినిమా.. పెద్ద విజయం.. మామూలు రికార్డ్ కాదిది