Sayli Chaudhari: సుమతీ శతకం హీరోయిన్ లుక్ అదిరింది
ABN , Publish Date - Jul 18 , 2025 | 06:21 PM
బిగ్ బాస్ అమర్ దీప్ హీరోగా సుమతీ శతకం చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.
బిగ్ బాస్ అమర్ దీప్ (Amardeep) హీరోగా ‘సుమతీ శతకం' (Sumathi Sathakam) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది. వింటేజ్ విలేజ్ డ్రామా, లవ్ స్టోరీలా ఈ చిత్రాన్ని కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో కొమ్మాలపాటి సాయి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఎం.ఎం. నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. శైలి చౌదరి (Sayli) కథానాయిక. ఇటీవల ఈ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల చేసిన మేకర్స్ శుక్రవారం హీరోయిన్ పాత్రకు సంబంధించిన లుక్ రివీల్ చేశారు. ఇందులో హీరోయిన్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. త్వరలో టీజర్‌ను విడుదల చేసి సినిమాపై మరింత అంచనాల్ని పెంచాలని మేకర్లు భావిస్తున్నారు.
అభిమానుల అంచనాలకు తగ్గట్టే ఉంటాయని నిర్మాత కొమ్మాలపాటి సాయి సుధాకర్ తెలిపారు. దసరాకి విడుదల చేయాలనే లక్ష్యంతో సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని అన్నారు. ఈ చిత్రంలో బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి హీరోగా నటిస్తుండగా, టేస్టీ తేజ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. మ్యూజిక్ డైరెక్టర్‌గా సుభాష్ ఆనంద్ , డైలాగ్ రైటర్‌గా బండారు నాయుడు, ఎడిటర్‌గా నాహిద్ మొహమ్మద్ , డీఓపీగా హాలేష్ పని చేస్తున్నారు.