సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dammu Sreeja: బిగ్ బాస్ అన్యాయం.. ప్రేక్షకుల ఓట్లకు విలువే లేదా

ABN, Publish Date - Oct 12 , 2025 | 10:09 PM

బిగ్ బాస్ (Biggboss) సీజన్ 9.. ఇది చదరంగం కాదు రణరంగం అంటూ మొదలైంది. ప్రతిసారిలా కాకుండా ఈసారి బాగా హడావిడిగా సీజన్ ను స్టార్ట్ చేశారు.

Dammu Sreeja

Dammu Sreeja: బిగ్ బాస్ (Biggboss) సీజన్ 9.. ఇది చదరంగం కాదు రణరంగం అంటూ మొదలైంది. ప్రతిసారిలా కాకుండా ఈసారి బాగా హడావిడిగా సీజన్ ను స్టార్ట్ చేశారు. కామనర్స్ ను హౌస్ లోకి తీసుకువస్తున్నామని చెప్పి.. వారిని అగ్ని పరీక్ష అనే పేరుతో గేమ్స్ పెట్టించి.. చివరకు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను లోపలి పంపారు. అక్కడ రెండు ఇళ్లు పెట్టి ఓనర్స్, టెనెంట్స్ అంటూ కొంతకాలం నడిపించారు. ఆ తరువాత ఒక్కొక్కరిగా కామనర్స్ ను బయటకు పంపించేస్తున్నారు.


ఇక ఇప్పుడు బిగ్ బాస్ మొత్తం సెలబ్రిటీలతో నిండిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో 6 గురు సెలబ్రటీలను లోపలికి పంపించారు. ఏదో హైప్ తీసుకురావడానికి మాత్రమే కామనర్స్ ను పంపించినట్లు తెలుస్తోంది. ఇక అందులో ఉన్న వారు గేమ్స్ ఆడినా.. ప్రేక్షకులకు నచ్చినా కూడా కొంతమందిని ఎలిమినేట్ చేయడం అనేది ప్రేక్షకులకు నచ్చలేదు. ఈరోజు డబుల్ ఎలిమినేషన్ లో ఫ్లోరా షైనీ, దమ్ము శ్రీజ ఎలిమినేట్ అయ్యారు. ఫ్లోరా ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యింది. కానీ, శ్రీజ మాత్రం ఇంట్లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ ద్వారా ఎలిమినేట్ అయ్యింది. అదే అన్యాయమని ప్రేక్షకులు మండిపడుతున్నారు.


ప్రియా ఉన్నంతవరకు శ్రీజ అరిచి గోల పెట్టినా కూడా గేమ్స్ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఆడింది. అంతే కాకుండా తనకు ఏది తప్పు అనిపిస్తే దాని గురించి గొంతు ఎత్తేది. దీనివలన చాలామంది సేవ్ కూడా అయ్యారు. ఎలిమినేట్ అయ్యే చివరి నిమిషం వరకు కూడా శ్రీజ తనవంతు ప్రయత్నంగా గేమ్ ఆడి నిలబడింది. ఇక శ్రీజ తో ఉన్న సుమన్ శెట్టికి వారు తక్కువ ఓట్లు వేశారు. నిజం చెప్పాలంటే సుమన్ గేమ్స్ లో అంత యాక్టివ్ ఉండడు. వెళ్ళిపోయినా ప్రేక్షకులు అంతగా ఫీల్ అయ్యేవారు కాదు. కానీ, ప్రేక్షకుల ఓటింగ్ కాకుండా వారికేమి అర్హత ఉందని ఒక దమ్మున్న ప్లేయర్ ని ఎలిమినేట్ చేశారు అని మండిపడుతున్నారు. ఈ ఎలిమినేషన్ అన్యాయమని, శ్రీజను మళ్లీ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి.

Akhil Akkineni: లెనిన్ కోసం అయ్యగారు.. మంచి హీరోయిన్నే పట్టారు

Divvela Madhuri: పట్టుచీర, మల్లెపూలతో బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి

Updated Date - Oct 12 , 2025 | 10:09 PM