Akhil Akkineni: లెనిన్ కోసం అయ్యగారు.. మంచి హీరోయిన్నే పట్టారు
ABN , Publish Date - Oct 12 , 2025 | 08:49 PM
అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఒక పెద్ద విజయం కోసం ఎదురుచూస్తున్నాడు
Akhil Akkineni: అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) ఒక పెద్ద విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటివరకు హీరోగా ఎదగడానికి అఖిల్ చాలా స్ట్రగుల్ అవుతూనే వస్తున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో హిట్ అందుకున్నా అది అయ్యగారిని నిలబెట్టలేకపోయింది. ఇక ఏజెంట్ ఎలాంటి డిజాస్టర్ అందుకుందో అందరికీ తెల్సిందే. ప్రస్తుతం అయ్యగారి ఆశలన్నీ లెనిన్ మీదనే పెట్టుకున్నాడు. లుక్ మార్చి, జోనర్ మార్చి ఈసారి అఖిల్.. లెనిన్ తో హిట్ అందుకోవాలని చాలా కష్టపడుతున్నాడు.
అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లెనిన్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. మొదట ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల నటిస్తుందని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాపై అటు అక్కినేని అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ , వీడియో కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఆదిలోనే హంసపాదు అన్నట్లు షూటింగ్ మొదలైన కొన్నిరోజులకే శ్రీలీల ఈ చిత్రం నుంచి తప్పుకుంది.
శ్రీలీల తప్పుకోవడానికి కారణాలు ఏవైనా.. లెనిన్ షూటింగ్ మాత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. మధ్యలో అఖిల్ పెళ్లి వలన ఇంకొంత ఆలస్యం అయ్యింది. ఒకానొక దశలో అసలు లెనిన్ షూటింగ్ జరుపుకుంటుందా అనేది కూడా ఎవరికి తెలియదు. ఎప్పటినుంచో శ్రీలీల ప్లేస్ ను భాగ్యశ్రీ బోర్సే రీప్లేస్ చేసిందని టాక్ నడిచింది. ఇప్పుడు భాగ్యశ్రీనే కన్ఫర్మ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కూడా పూర్తయ్యిందని, క్లైమాక్స్ ఒక్కటి ఫినిష్ అయితే షూటింగ్ ఫినిష్ అని సమాచారం. దీంతో శ్రీలీల వెళ్లిపోయినా.. అఖిల్ మంచి హీరోయిన్నే పట్టాడు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక భాగ్యశ్రీ సైతం వచ్చినదగ్గరనుంచి హిట్ అందుకున్నది లేదు. మరి ఈ ముద్దుగుమ్మ అఖిల్ కి ఒక మంచి విజయాన్ని అందించే భాగ్యాన్ని కలిగిస్తుందో లేదో చూడాలి.
Divvela Madhuri: పట్టుచీర, మల్లెపూలతో బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన దువ్వాడ మాధురి
Filmfare Awards 2025: అట్టహాసంగా.. ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం