Kajol: యాక్టర్‌లకు ఆ అవకాశం ఉండదు అన్నానే తప్ప తక్కువ చేయలేదు..
ABN , Publish Date - Oct 14 , 2025 | 05:37 PM
సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ బిజీగా గడుపుతున్నారు బాలీవుడ్ బ్యూటీ కాజోల్ (Kajol). ప్రస్తుతం ఆమె సెలబ్రిటీ టాక్ షో ‘టూ మచ్’కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ బిజీగా గడుపుతున్నారు బాలీవుడ్ బ్యూటీ కాజోల్ (Kajol). ప్రస్తుతం ఆమె సెలబ్రిటీ టాక్ షో ‘టూ మచ్’కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.. నటీనటులు ఒత్తిడికి గురవుతారని తెలుపుతూ కార్పొరేట్ ఎంప్లాయిస్‌తో కంపేర్ చేయడంతో చర్చనీయాంశమైంది. దీనిపై కాజోల్ క్లారిటీ (Kajol clarity)ఇచ్చారు.
‘సొసైటీలో అన్ని ఉద్యోగాలు వేరు, నటన వేరు. షూటింగ్ సమయంలో నటీనటులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. మేము ‘ది ట్రయిల్’ రెండో సీజన్ కోసం ఒక ప్రాంతానికి వెళ్లాం. 40 రోజులు విరామం లేకుండా షూటింగ్ చేశాం. ఆ రోజుల్లో మేం ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. అలాగే క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్ చేయాలి. సరిగ్గా తినాలి. ఒకే లుక్‌లో ఉండాలి. అలా ఉండడం చాలా ఒత్తిడిగా ఉంటుంది. ఆఫీసులో ఉన్నట్లు నటీనటులకు బ్రేక్ టైం ఉండదు. 9 నుంచి 5 వరకూ ఉద్యోగం చేసేవారు మధ్యలో టీ బ్రేక్ తీసుకోవచ్చు. లేదా కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు. యాక్టర్స్ అలా చేయలేరు. షూటింగ్‌లో విరామ సమయంలో కూడా అందరి కళ్లు నటీనటులపైనే ఉంటాయి. నవ్వినా, కదులుతున్నా, కూర్చున్నా.. ఏం చేసినా ప్రతిక్షణం పరిశీలిస్తూనే ఉంటారు. ఆ ఉద్దేశంతోనే నేను కంపేర్ చేశాను. అంతే కాని ఎవరినీ తక్కువ చేయలేదు. ప్రతి వృత్తిని, వ్యక్తిని గౌరవిస్తాను’ అని కాజోల్ అన్నారు.