సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi: అప్పుడే ‘పెద్ది’ రికార్డుల వేట‌.. మ‌తి పొగొట్టేలా ఓటీటీ డీల్‌

ABN, Publish Date - Dec 01 , 2025 | 06:20 PM

' పెద్ది' అప్పుడే బిగ్ బ్రేకింగ్ గా మారింది. సెట్స్ పై ఉండగానే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. జస్ట్ సింగిల్ సాంగ్ తోనే భారీ బిజినెస్ ను కొల్లగొట్టింది. నంబర్ చూసినవాళ్లంతా నోరెళ్లబెడుతున్నారు.

Peddi movie

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన కెరీర్‌లోనే అత్యంత భిన్నమైన పాత్రతో అటెంప్ట్ చేస్తున్న మూవీ ‘పెద్ది’ (Peddi). ‘ఉప్పెన’తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు సానా (Buchchibabu Saana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ రూరల్ యాక్షన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే దాని ప్రీ–రిలీజ్ బిజినెస్ ఆకాశాన్నంటుతోంది. తాజాగా ఈ మూవీకి వచ్చిన ఆఫర్ చూస్తే మతిపోయేలా ఉంది.


తాజా సమాచారం ప్రకారం ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ‘పెద్ది’ సినిమా అన్ని భాషల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సుమారు రూ.130 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. ఇంత వరకు రామ్ చరణ్ సినిమాల్లో ఎన్నడూ లేనంత భారీ ఓటీటీ డీల్ ఇది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకోకముందే ఇలాంటి భారీ ఒప్పందం కుదరడం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

' పెద్ది' మూవీకి ఇంత డిమాండ్ రావడానికి చాలా అంశాలే కలిసొచ్చాయి. మరోవైపు ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ ‘చికిరి చికిరి’ యూట్యూబ్‌లో 100 మిలియన్ వ్యూస్ దాటడం కూడా ఈ సినిమా ట్రెండ్‌ను మరోసారి నిరూపించింది. రెహమాన్ మాస్ బీట్, చరణ్ ఎనర్జిటిక్ డాన్స్, జాన్వీ కపూర్ గ్లామర్ ఈ మూడూ కలిసి దేశవ్యాప్తంగా వైరల్ ఫీవర్ సృష్టించాయి.

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ నుంచి టిక్‌టాక్ వరకు ఎక్కడ చూసినా ‘చికిరి’ స్టెప్పులే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీ సెట్‌లో క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేస్తోంది. ‘పెద్ది’… మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

Read Also: Samantha weds Raj: భూత శుద్థి వివాహం అంటే ఏంటి

Read Also: December Movies: అఖండ నుంచి అవతార్‌ వరకూ.. డిసెంబ‌ర్ అంతా ద‌బిడి దిబిడే

Updated Date - Dec 01 , 2025 | 06:53 PM