Havish: చిరాన్ ఫోర్ట్ క్లబ్ లో 'నేను రెడీ'....

ABN , Publish Date - Dec 09 , 2025 | 03:11 PM

హవీష్, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న 'నేను రెడీ' సినిమా క్లయిమాక్స్ చిత్రీకరణ మొదలైంది. ఎనిమిది రోజుల పాటు ప్రధాన తారాగణంపై బేగంపేట్ లోని చిరాన్ పోర్ట్ క్లబ్ లో దర్శకుడు త్రినాథరావు నక్కిన దీనిని షూట్ చేయబోతున్నారు.

Nenu Ready Movie

హవీష్‌ (Havish), కావ్య థాపర్ (Kavya Thapar) జంటగా నటిస్తున్న సినిమా 'నేను రెడీ' (Nenu Ready). ఇప్పటి వరకూ యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన హవీష్‌ ఇప్పుడీ సినిమాతో వినోదాల జల్లు కురిపించబోతున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ షూటింగ్ కొంతకాలంగా శరవేగంగా సాగుతోంది. తాజాగా డిసెంబర్ 9 నుండి 16 వరకూ క్లయిమాక్స్ ను దర్శకుడు నక్కిన త్రినాథరావు చిత్రీకరించబోతున్నారు. ప్రధాన తారాగణం అంతా పాల్గొంటుండగా హైదరాబాద్ బేగంపేట చిరాన్ పోర్ట్ క్లబ్ లో ఉదయం 6 నుండి సాయంత్రం 6 వరకూ షూట్ చేస్తున్నారు.


NR-1.jpg

నూతన సంవత్సరంలో తమ 'నేను రెడీ' మూవీని జనం ముందుకు తీసుకొస్తామని మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమాను హార్నిక్స్ ఇండియా ఎల్.ఎల్.పి. బ్యానర్ లో హవీష్‌ సోదరి నిఖిల కోనేరు (Nikhila Koneru) నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కు మంచి స్పందన లభించిందని, త్రినాథరావు నక్కిన (Trinadharao Nakkina) తన మార్క్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ స్క్రిప్ట్ ను రెడీ చేశారని, ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఈ మూవీ ఉంటుందని ఆమె తెలిపారు. ఇందులో ఇతర ప్రధాన పాత్రలను బ్రహ్మానందం, 'వెన్నెల' కిషోర్, మురళీ శర్మ, వీటీవీ గణేషన్, అజయ్, మురళి గౌడ్, గోపరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం మిక్కీ జే మేయర్ సమకూర్చుతున్నారు. విక్రాంత్ శ్రీనివాస్ దీనికి కథ, మాటలు అందిస్తున్నారు.

Also Read: Ram Charan: జపాన్‌ ఫ్యాన్స్‌ చెర్రీ ఇంటికొచ్చేశారు..

Also Read: Prabhas in Japan: ప్రభాస్ సేఫ్ .. దర్శకుడు క్లారిటీ

Updated Date - Dec 09 , 2025 | 03:14 PM