Prabhas in Japan: ప్రభాస్ సేఫ్ .. దర్శకుడు క్లారిటీ
ABN , Publish Date - Dec 09 , 2025 | 02:19 PM
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. ‘బాహుబలి: ది ఎపిక్’ చిత్రం ఈ నెల 12న జపాన్‌లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ప్రభాస్ అక్కడి అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం జపాన్‌లో ఉన్నారు. ‘బాహుబలి: ది ఎపిక్’ చిత్రం ఈ నెల 12న జపాన్‌లో విడుదల కానున్న నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ప్రభాస్ అక్కడి అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అయితే తాజాగా జపాన్ ఉత్తర తీరంలో భారీ భూకంపం సంభవించడంతో (Japan Earthquake)ఆయన అభిమానులు ఆందోళన చెందుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. దర్శకుడు మారుతి అభిమానులకు రిప్లైతో క్లారిటీ ఇచ్చారు. (Prabhas Safe)
‘జపాన్ దేశంలో భూకంపం వచ్చింది. సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. మా హీరో ఎక్కడ ఉన్నాడు. ఈరోజు సాయంత్రం ఇండియాకు రిటర్న్ అవుతాడా?’ అని ఓ అభిమాని మారుతిని ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టాడు. దానికి దర్శకుడు స్పందిస్తూ.. ‘ప్ఘ్రభాస్‌తో ఇప్పుడే మాట్లాడాను. భూకంపం వచ్చిన ఏరియాలో ఆయన లేరు. ఆయన క్షేమంగా ఉన్నారు. ఆందోళన చెందకండి’ అని మారుతి రిప్లై ఇచ్చారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మారుతి దర్శకత్వంలో ఆయన నటించిన ‘ది రాజాసాబ్’ జనవరి 9న విడుదల చేయనున్నారు. ఇప్పటికే టీమ్ ప్రమోషన్స్ షురూ చేసింది. త్వరలో ఈ సినిమా నుంచి రెండో పాటను విడడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క హను రాఘవపూడితో ‘ఫౌజీ’ చిత్రం చేస్తున్నారు. ఇటీవల సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ చిత్రం ఇటీవల మొదలైంది.