Ram Charan: జపాన్ ఫ్యాన్స్ చెర్రీ ఇంటికొచ్చేశారు..
ABN , Publish Date - Dec 09 , 2025 | 02:26 PM
తెలుగు స్టార్ హీరోలకు జపాన్‌లో (Japan Fans) అభిమానగణం ఎక్కువే! ప్రభాస్, రామ్‌చరణ్(Ram charan), ఎన్టీఆర్‌లకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.
తెలుగు స్టార్ హీరోలకు జపాన్‌లో (Japan Fans) అభిమానగణం ఎక్కువే! ప్రభాస్, రామ్‌చరణ్(Ram charan), ఎన్టీఆర్‌లకు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. సినిమాల విడుదల సందర్భంలో అక్కడి అభిమానులను కలుస్తుంటారు మన హీరోలు. కొన్నాళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసేందుకు ఓ జపాన్ యువతి హైదరాబాద్ వచ్చేసింది. అన్నా అంటూ ఆప్యాయంగా పలకరించి.. తారక్ డైలాగ్‌లు చెప్పుకొచ్చింది. రామ్‌చరణ్‌పై అభిమానం పెంచుకున్న కొందరు అభిమానులు ఇక్కడికి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న చరణ్ వారందరినీ ఇంటికి ఆహ్వానించారు.
వారి కోసం సమయం కేటాయించి సరదాగా గడిపారు. వారితో ఫొటోలు దిగారు. ‘ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూశామని చాలాబాగా నచ్చిందని ఆ అభిమానులు చెప్పారు. వారంతా పెద్ది సినిమా టీషర్టులు ధరించి వచ్చారు. అలాగే రామ్‌చరణ్ నటించిన చిత్రాల్లో కొన్ని ఫొటో ఫ్రేమ్‌లను కూడా తీసుకొచ్చారు. వారి అభిమానానికి చరణ్ ఫిదా అయ్యారు. ఆ టీమ్ అందరికీ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రంతో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు సాన దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో సినిమాకు విపరీమైన హైప్ వచ్చింది. వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను విడుదల చేయనున్నారు.