OG Movie: ఏం హైప్ రా మావా.. ఓజీలో టిల్లు రాధిక ఐటెం సాంగ్
ABN, Publish Date - Aug 29 , 2025 | 09:44 PM
ఓజీ.. ఓజీ.. ఓజీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఇదే వినిపిస్తుంది. మరో కొన్నిరోజుల్లో ఓజీ (OG) ప్రేక్షకుల ముందుకు రానుంది.
OG Movie: ఓజీ.. ఓజీ.. ఓజీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా ఇదే వినిపిస్తుంది. మరో కొన్నిరోజుల్లో ఓజీ (OG) ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా సుజీత్(Sujeeth) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఓజీ. డీవీవీ దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈసారి సుజీత్ చాలా గట్టిగా కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. దానికోసమే స్టార్ క్యాస్టింగ్ మొత్తాన్ని రంగంలోకి దింపాడు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా.. అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి, నారా రోహిత్ కు కాబోయే భార్య సిరి లేళ్ల లాంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ హైప్ తోనే సతమతమవుతుంటే.. సుజీత్ ఇక్కడితో ఆగకుండా మరో హాట్ బ్యూటీని కూడా రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. డీజే టిల్లుతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన నేహా శెట్టి ఓజీలో నటిస్తుంది. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా ఒకషాప్ ఓపెనింగ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చింది. అయితే అది ఏ క్యారెక్టర్ అనేది రివీల్ చేయలేదు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఓజీలో నేహా ఐటెంసాంగ్ లో నటిస్తుందని అంటున్నారు. క్యారెక్టర్ తో పాటు ఒక సాంగ్ లో నటించి కనుమరుగవుతుందని టాక్ నడుస్తోంది. నిజంగా నేహాకు ఇది లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు.
రాధికా అనే బ్రాండ్ తరువాత నేహా అంతటి విజయాన్ని దక్కించుకోలేకపోయింది. స్టార్ హీరోల సరసన అవకాశాలు వచ్చినా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓజీలో ఒక చిన్న పాత్రలో కనిపించినా ఆమెకుగుర్తింపు లభిస్తుంది. సాంగ్ హిట్ అయినా.. లేక క్యారెక్టర్ కనెక్ట్ అయినా అమ్మడని ఆపడం ఎవరి తరం కాదు అని చెప్పొచ్చు. సుజీత్ చివరి సినిమా సాహోలో ఐటెంసాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెల్సిందే. ఈసారి అంతకుమించి ఉండాలని కుర్ర డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడు. మరి ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 25 న ఓజీ రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.
Sunny Leone: నా పిల్లల్ని నేను కనలేదు.. ఆమెకు చాలా డబ్బులిచ్చి ..
Mowgli: జయం.. అహింస కలిపి కొట్టినట్లుందే..