Sunny Leone: నా పిల్లల్ని నేను కనలేదు.. ఆమెకు చాలా డబ్బులిచ్చి ..

ABN , Publish Date - Aug 29 , 2025 | 08:17 PM

అందాల శృంగార తార సన్నీ లియోన్ (Sunny Leone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Sunny Leone

Sunny Leone: అందాల శృంగార తార సన్నీ లియోన్ (Sunny Leone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు శృంగార తారగా ఒక ఊపు ఊపిన సన్నీ.. ఆ తరువాత ఆ వృత్తి నుంచి బయటకు వచ్చి బాలీవుడ్ లో నటిగా స్థిరపడింది. డేవిడ్ వెబర్ ను పెళ్ళాడిన సన్నీ లియోన్ ముగ్గురు పిల్లలకు తల్లిగా మారింది. అయితే వారికి ఆమె జన్మనివ్వలేదు. సరోగసీ ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనివ్వగా.. ఒక పాపను మాత్రం దత్తత తీసుకుంది.


తాజాగా తన సరోగసీ ప్రయాణంపై సన్నీ మొదటిసారి నోరువిప్పింది. బాలీవుడ్ హీరోయిన్ సోహా అలీఖాన్ పాడ్ క్యాస్ట్ కు హాజరైన సన్నీ.. తన బిడ్డలా గురించి మాట్లాడింది. తనకు బిడ్డలను కడుపులో మోయడం ఇష్టం లేకనే సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిచ్చినట్లు తెలిపింది. ' మొదట నుంచి నాకు ఒక బిడ్డను దత్తత తీసుకోవాలని ఉండేది. మొదటిసారి ఐవిఎఫ్ ఫెయిల్ అయ్యాకా.. బిడ్డ దత్తతకు మేము అప్లై చేసాం కూడా. అప్పుడే ఒక పాపను దత్తత తీసుకున్నాం.


ఇక సరోగసీనే ఎందుకు ఎంచుకున్నాను అంటే.. నాకు కడుపులో బిడ్డను మోయడం ఇష్టం లేదు. అందుకే ఒక మహిళను ఎంచుకొని ఆమె కడుపులో మా బిడ్డను పెంచాం. దానికి చాలా డబ్బు ఖర్చు చేసాం. ఆమెతో పాటు ఆమె భర్తకు కూడా మేము డబ్బులిచ్చాం. మా బిడ్డల వలన ఆమె ఒక ఇల్లు కట్టుకుంది. మొదటి భర్తకు విడాకులిచ్చి రెండోపెళ్లి చేసుకుంది' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సన్నీ వ్యాఖ్యలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.


చాలామంది సెలబ్రిటీలు ఇలానే అందాన్ని కాపాడుకోవడానికి సరోగసీ వెంటపడుతున్నారు. ప్రియాంక చోప్రా, నయనతార, శిల్పాశెట్టి ఇలా చాలామంది సెలబ్రిటీలు సరోగసీ ద్వారా తల్లులు అయినవారే. బిడ్డను మోయడం అనేది ఒక అందమైన అనుభూతి. అనారోగ్య సమస్యల వలన సరోగసీకి వెళ్తే ఓకే కానీ, ఇలా అందాన్ని కాపాడుకోవడం కోసం అయితే అది చాలా దారుణమని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Mowgli: జయం.. అహింస కలిపి కొట్టినట్లుందే..

Komali Prasad: ఫ్రాంఛైజీ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యా..

Updated Date - Aug 29 , 2025 | 08:17 PM