సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nayanthara: మెగా 157.. నయన్‌ నడక కలిసింది

ABN, Publish Date - Jun 17 , 2025 | 12:46 PM

అగ్ర కథానాయికుడు చిరంజీవితో అనిల్‌ రావిపూడి ఓ సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే! మెగా 157 వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

అగ్ర కథానాయికుడు చిరంజీవి(Chiranjeevi)తో అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) ఓ సినిమా ప్రారంభించిన సంగతి తెలిసిందే! మెగా 157 వర్కింగ్‌ (Mega 157) టైటిల్‌తో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ముస్సోరిలోని సుందరమైన ప్రదేశాలలో రెండవ షెడ్యూల్‌ జరుగుతోంది. ప్రస్తుతంలో ముస్సోరిలో చిరంజీవి, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణలో నయనతార (Nayanthara) అడుగుపెట్టింది. అక్కడ హీరోహీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారని తెలిసింది.


అనిల్‌ రావిపూడి మార్క్‌ కామెడీ, చిరంజీవి తాలుక మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్  బ్యానర్‌, గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు బారీ వ్యయంతో నిర్మిస్తున్నారు. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఇందులో చిరంజీవి పేరు శివ శంకర్‌ వర ప్రసాద్‌గా ప్లాన్‌ చేశారు దర్శకుడు అనిల్‌. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.


ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం సక్సెస్‌తో మంచి జోరు మీదున్నారు అనిల్‌ రావిపూడి. ఆ సినిమా సక్సెస్‌ ఇచ్చిన కిక్‌తో చిరు కోసం కథ రెడీ చేశారు. ఇప్పుడు ఎనర్జీతో అంతకుమించి సూపర్‌హిట్‌ కొట్టాలని అనిల్‌ శాయశక్తుల కృషి చేస్తున్నారు.

Updated Date - Jun 17 , 2025 | 12:46 PM