Star Hero: మారు వేషంలో ఎన్టీఆర్, రజినీ సినిమాలు చూసిన స్టార్ హీరో.. ఎవరో గుర్తుపట్టారా

ABN , Publish Date - Aug 15 , 2025 | 01:01 PM

ఎన్నోరోజుల నుంచి ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఆగస్టు 14 న రెండు పెద్ద సినిమాలు కూలీ(Coolie), వార్ 2(War 2) రిలీజ్ అయ్యాయి. అయితే మొదటి నుంచి ఏ సినిమా గెలుస్తుంది.. ? ఏ సినిమా ఓడిపోతుంది..? అని ప్రేక్షకులు ఏ అంచనాలను అయితే పెట్టుకున్నారో ఆ అంచనాలు తారుమారు అయ్యాయి.

Tollywood

Star Hero: ఎన్నోరోజుల నుంచి ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. ఆగస్టు 14 న రెండు పెద్ద సినిమాలు కూలీ(Coolie), వార్ 2(War 2) రిలీజ్ అయ్యాయి. అయితే మొదటి నుంచి ఏ సినిమా గెలుస్తుంది.. ? ఏ సినిమా ఓడిపోతుంది..? అని ప్రేక్షకులు ఏ అంచనాలను అయితే పెట్టుకున్నారో ఆ అంచనాలు తారుమారు అయ్యాయి. పరాజయమే ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నా లోకేష్ కనగరాజ్. మొట్ట మొదటిసారి కూలీ సినిమాతో పరాజయాన్ని అందుకున్నాడు. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మొదటిరోజే మిక్స్డ్ టాక్ ను అందుకుంది. అక్కినేని నాగార్జున కూడా కూలీని కాపాడలేకపోయాడు అని నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు.


ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇచ్చిన మూవీ వార్ 2. హృతిక్ రోషన్ మరొక హీరోగా నటించిన ఈ సినిమా కూడా మొదటిరోజు మిక్స్డ్ టాక్ ను అందుకుంది. అయితే కూలీతో పోలిస్తే వార్ 2 కొద్దిగా బెటర్ అని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. రెండు సినిమాలు పోటాపోటీగా నడుస్తున్నాయి. మొదటిరోజు టాక్ ఎలా ఉన్నా.. రోజులు పెరిగేకొద్దీ సినిమాపై ఇంప్రెషన్ మారే అవకాశం లేకపోలేదు. ఇక ఇదంతా పక్కన పెడితే తమ అభిమాన హీరోల సినిమాలను కేవలం అభిమానులు మాత్రమే కాదు హీరోలు కూడా మొదటిరోజు మొదటి షో చూడాలని తాపత్రయపడుతుంటారు.


హీరోలుగా అందరి మధ్య కూర్చొని చూడలేరు కాబట్టి దొంగచాటుగా వెళ్లి థియేటర్ లో కూర్చొని చూసి తాము కూడా అభిమానులమని నిరూపించుకుంటారు. తాజాగా న్యాచురల్ స్టార్ నాని కూడా తాను రజినీకాంత్ అభిమానిని అని నిరూపించుకున్నాడు. దాంతోపాటు ఎన్టీఆర్ ఫ్రెండ్ అని కూడా అనిపించుకున్నాడు. గతరాత్రి AMB మాల్ లో నాని బ్యాక్ టూ బ్యాక్ కూలీ, వార్ 2 సినిమాలను వీక్షించాడు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, బ్లాక్ క్యాప్, మాస్క్ పెట్టుకొని అస్సలు గుర్తుపట్టలేకుండా ఉన్నాడు. నిజంగా నాని చెప్పినా ఎవరూ కుల నమ్మరు. అయితే కొందరు మాత్రం నానిని అలా ఉన్నా గుర్తుపట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Ravindra Bharathi: రవీంద్రభారతిలో.. ఆ హాలీవుడ్‌ సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌! ఎంట్రీ ఫ్రీ

Virgin Boys: టెంప్ట్ చేసే.. ఎలా ఎలా వీడియో సాంగ్ రిలీజ్‌

Updated Date - Aug 15 , 2025 | 04:04 PM