Virgin Boys: టెంప్ట్ చేసే.. ఎలా ఎలా వీడియో సాంగ్ రిలీజ్
ABN , Publish Date - Aug 15 , 2025 | 10:13 AM
కుర్రకారును టార్గెట్ చేస్తూ పూర్తిగా బోల్డ్ జానర్‌లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం వర్జిన్ బాయ్స్
కుర్రకారును టార్గెట్ చేస్తూ పూర్తిగా బోల్డ్ జానర్‌లో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం వర్జిన్ బాయ్స్ (Virgin Boys). జూలైలో థియేటర్లలోకి వచ్చి అంతగా జనాధరణ పొందలేక పోయిన ఈ చిత్రం ఈ శుక్రవారం నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు కూడా వచ్చేసింది. సమాజంలో యువతీ యువకుల మధ్య ఉన్న ఆధునిక రిలేషన్‌షిప్స్ నేపథ్యంగా ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ బోల్డ్ అండ్ రొమాంటిక్‌గా చిత్రీకరించారు. దయానంద్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, రాజా దరపునేని నిర్మించారు. గీతానంద్ (Geetanand), మిత్రాశర్మ (Mitraaw Sharma), శ్రిహన్, బిగ్‌బాస్ విజేత కౌశల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అయితే.. ఈ సినిమా విడుదలకు ముందే ఓ రేంజ్‌లో ముద్దులు, హగ్గులతో రూపొందించిన పాటలు యువతలో మంచి హైప్ క్రియేట్ చేశాయి. ఈ ఉత్సాహాన్ని కొనసాగిస్తూ తాజాగా శుక్రవారం ఎలా ఎలా (Yela Yela Full Video Song) అంటూ సాగే మరో టెప్టింగ్ రొమాంటిక్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు శ్రీమణి (Sri Mani ) సాహిత్యం అందించగా అదితి భవరాజు (Aditi Bhavaraju), స్మరణ్ (Smaran) ఆలపించారు. సమ్రాన్ సాయి సంగీతం అందించారు. అయితే, ఈ పాటలో కూడా గత పాటలాగే బోల్డ్ విజువల్స్, ముద్దు సన్నివేశాలు, టెంప్ట్ చేసే సీన్లు ఎక్కువగానే ఉన్నాయి.