The Girlfriend: రశ్మిక సరికొత్త ప్రేమకథ.. 25న 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్
ABN , Publish Date - Oct 23 , 2025 | 02:37 PM
నేషనల్ క్రష్ రశ్మిక మందణ్ణ నటిస్తున్న 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీ నవంబర్ 7న ఐదు భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ నెల 25న ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.
ఈ యేడాది రశ్మిక వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తి జీవితంలోనూ సమ్ థింగ్ స్పెషల్. చిరకాలంగా ప్రేమించుకుంటున్న విజయ్ దేవరకొండ, రశ్మిక వివాహ నిశ్చితార్థం ఇదే యేడాది జరిగింది. అలానే యేడాది ప్రారంభంలో విడుదలైన 'ఛావా' భారీ విజయాన్ని అందుకుని, రశ్మిక సత్తాను జాతీయ స్థాయిలో మరోసారి నిరూపించింది. అయితే ఆ తర్వాత వచ్చిన 'సికిందర్, కుబేర, థామా' చిత్రాలు ఆశించిన విజయాన్ని అందుకోవడంలో విఫలమయ్యాయి. దాంతో పెద్దంత బజ్ క్రియేట్ చేసిన 'ది గర్ల్ ఫ్రెండ్'పై ఇప్పుడు అందరూ దృష్టి పెట్టారు. కంటెంట్ ప్రధానంగా నటుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతోంది. దీనికి ముందు ఈ నెల 25న థియేట్రికల్ ట్రైలర్ రానుంది.
దీక్షిత్ శెట్టి హీరోగా నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' మూవీని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నిర్మించారు. ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆలోచింప చేస్తుందని నిర్మాతలు ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి చెబుతున్నారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు సమకూర్చిన 'ది గర్ల్ ఫ్రెండ్'లోని కొన్ని పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి.
Also Read: Avatar: Fire and Ash: ఇండియాలో.. 'అవతార్' భారీ ఈవెంట్
Also Read: Sai Abhyankkar: అనిరుధ్‌కు షాక్.. లీడింగ్‌లోకి సాయి అభ్యంకర్