Narivetta: నిశ్శబ్దంగా తెలుగులో వచ్చేసిన టొవినో థామస్ మూవీ

ABN , Publish Date - Jun 03 , 2025 | 04:29 PM

మలయాళ కథానాయకుడు టొవినో థామస్ తాజా చిత్రం 'నరివెట్ట' మే 23న కేరళలో విడుదలైంది. ఇప్పుడా సినిమాను అదే పేరుతో తెలుగులో డబ్ చేసి మే 30న రిలీజ్ చేశారు.

ప్రముఖ మలయాళ కథానాయకుడు టొవినో థామస్ (Tovion Thomas) నటిస్తున్న పలు చిత్రాలు ఇప్పుడు తెలుగులోనూ డబ్ అవుతున్నాయి. 'ఐడెంటిటీ, ఏఆర్ఎమ్' వంటి సినిమాలు తెలుగులోనూ ఫర్వాలేదనిపించాయి. అయితే అతని తాజా చిత్రం 'నరివెట్ట' (Narivetta) మే 23న విడుదలైంది. మంచి ఆదరణ దానికి దక్కింది. ఈ పోలీస్ స్టోరీని తెలుగువారు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకంతో వారం రోజుల వ్యవధిలోనే దీనిని తెలుగులో డబ్ చేసి మే 30న విడుదల చేశారు.


'నరివెట్ట' చిత్రం ఎలాంటి ప్రచారం, హడావుడి, హంగామా లేకుండా తెలుగులో విడుదల కావడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇందులోని టొవినో థామస్ నటనకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ కాప్ యాక్షన్ డ్రామాకు తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తోంది. ఈ సినిమా చూసి ప్రేక్షకులు భావోద్వేగానికి గురి కావడం ఆనందాన్ని కలిగించిందని హీరో టొవినో థామస్ తెలిపారు. అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని అబిన్ జోసెఫ్ ప్రొడ్యూస్ చేశాడు. ఇందులో సురాజ్ వెంజరమూడు (Suraj Venjaramoodu), చేరన్ (Cheran), ఆర్య సలీమ్, ప్రియంవద కృష్ణన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ (Jakes Bejoy) సంగీతం సమకూర్చాడు.

Also Read: Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు మళ్లీ వాయిదా.. ?

Also Read: Kamal Haasan: అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు కమల్‌.. మీరేమైనా చరిత్రకారులా...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 03 , 2025 | 04:48 PM