HariHara Veeramallu: హరిహర వీరమల్లు మళ్లీ వాయిదా.. ?
ABN , Publish Date - Jun 03 , 2025 | 03:30 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు(HariHara Veeramallu) సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటించిన హరిహర వీరమల్లు(HariHara Veeramallu) సినిమా విషయంలో ఏం జరుగుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ క్రిష్(Director Krish) ఈ చిత్రాన్ని మొదలుపెట్టగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది.
వీరమల్లు మొదలుపెట్టిన దగ్గరనుంచి ఇప్పటివరకు ఏదొక ఆటంకం వస్తూనే ఉంది. క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ(Jyothi Krishna) ఆ బాధ్యతలను స్వీకరించాడు. పదవి వచ్చినా.. ప్రజా సమస్యల మధ్య సతమతమవుతున్నా పవన్.. ఈ సినిమా నుంచి తప్పుకోకుండా టైమ్ చూసుకొని సినిమాను ఫినిష్ చేశాడు. ఇక రిలీజ్ డేట్లు గురించి చెప్పాలంటే పెద్ద లిస్ట్ వస్తుంది. ఎన్నో వాయిదాల తరువాత ఎట్టకేలకు జూన్ 12 న హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది అని మేకర్స్ చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్యనే పవన్ డబ్బింగ్ పనులు కూడా పూర్తిచేసారు.
Also Read: Chiranjeevi: 25 ఏళ్ల ప్రస్థానం.. శేఖర్ కమ్ములకు చిరు బెస్ట్ విషెస్
ఇంకోపక్క నిర్మాత ఏఎం రత్నం.. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టాడు. ఈ నెల 8 న తిరుపతిలో వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుందని టాక్ వచ్చింది. అయితే ఈలోపే మరోసారి వీరమల్లు వాయిదా అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సినిమా వాయిదా పడడానికి చాలా కారణాలు చెప్పుకొస్తున్నారు.
కొందరు సీజీ వర్క్ అవ్వలేదని అంటుంటే.. ఇంకొందరు బయ్యర్లు దొరకలేదని చెప్పుకొస్తున్నారు. 9 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకొని ఇప్పటివరకు ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయలేదని, ఇంకా ట్రైలర్ కట్ కూడా రెడీ అవ్వలేదని అంటున్నారు. జూన్ 12 న కాకపోతే ఇంకెప్పుడు అంటే.. జూలై 4 కి వీరమల్లు వాయిదా పడిందని టాక్ నడుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.