The Paradise: కనెక్ట్ మోబ్‌సీన్ ఏజెన్సీతో చర్చలు.. అందుకేనా..
ABN , Publish Date - Sep 01 , 2025 | 11:12 AM
నాని కథానాయకుడిగా ఓదెల శ్రీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది పారడైజ్’. ఇప్పుడీ సినిమా హాలీవుడ్‌పై గురి పెట్టింది.
నాని (Nani) కథానాయకుడిగా ఓదెల శ్రీకాంత్ (Srikanth Odela) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది పారడైజ్’ (The Paradise). చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ముమ్మరం చేశారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడీ సినిమా హాలీవుడ్‌పై గురి పెట్టింది. పాన్ ఇండియాను దాటి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడమే టార్గెట్‌గా ప్రణాళిక చేస్తుంది చిత్ర బృందం. అందులో భాగంగానే కనెక్ట్ మోబ్‌సీన్ (Connekkt MobScene) అనే హాలీవుడ్ ఏజెన్సీతో చర్చలు చేస్తోంది. ‘అవతార్’ సహా ఎన్నో సినిమాలకి మార్కెటింగ్, ప్రచార వ్యూహాల్ని అందించిన సంస్థ ఇది. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్నా సినిమా కోసం కూడా కనెక్ట్ మోబ్‌సీన్ ఏజెన్సీతో టైఅప్ అవుతోంది ప్రపంచవ్యాప్తంగా విడుదలను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమా కోసం ప్రఖ్యాత హాలీవుడ్ నటులను సెలెక్ట్ చేయడంపై కూడా దృష్టిపెట్టినట్టు చిత్రబృందం తెలిపింది. గ్లోబల్ సినిమాకి తగ్గట్టుగానే సినిమా ప్రచార కార్యక్రమాల్ని చేపడుతున్నట్టు వెల్లడించారు.
‘దసరా’ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో వచ్చే ఏడాది మార్చి 26న ఈ చిత్రం విడుదల కానుంది.
ALSO READ: Dragon: ఎన్టీఆర్‌కు జోడీ కుదిరింది..
Monday Tv Movies: సోమవారం, సెప్టెంబర్ 01.. టీవీ ఛానళ్లలో వచ్చే తెలుగు సినిమాలివే
Krish Jagarlamudi: స్వీటీపై మాట పడకుండా బాగానే కవర్ చేశాడే
Allu Arjun: ప్రతి ఒక్కరికీ.. ధన్యవాదాలు! అల్లు అర్జున్ ఎమోషనల్ నోట్