Nandamuri Balakrishna: యాక్టింగ్ బాట పట్టిన బాలయ్య కుమార్తె..
ABN, Publish Date - Oct 07 , 2025 | 09:47 PM
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కు ఇద్దరు అందమైన కుమార్తెలు ఉన్నారు. ఎప్పుడు వారిని తెరపై తీసుకురావాలని బాలయ్య ఆలోచించలేదు.
Nandamuri Balakrishna: ఇప్పటివరకు నందమూరి వంశం నుంచి ఎంతోమంది హీరోలు వచ్చారు కానీ, ఒక్క వారసురాలు కూడా తెరపై కనిపించలేదు. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) కు ఇద్దరు అందమైన కుమార్తెలు ఉన్నారు. ఎప్పుడు వారిని తెరపై తీసుకురావాలని బాలయ్య ఆలోచించలేదు. చదువు పూర్తికాగానే వారికి పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపేశాడు. యేమాతకు ఆ మాట బాలయ్య ఇద్దరు కుమార్తెలు హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరు. బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మిణి ప్రస్తుతం సీఎం చంద్రబాబు కోడలిగా.. నారా లోకేష్ కు భార్యగా ఉంటూనే వారి బిజినెస్ లు చూసుకుంటూ బిజీగా ఉంది.
బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని సైతం పెళ్లి చేసుకొని భర్తకు సంబంధించిన బిజినెస్ పనులు చూసుకుంటూనే.. తండ్రి కాస్ట్యూమ్ డిజైనర్ గా మారింది. బాలయ్య హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షోకి అన్ని తానే అయ్యి చూసుకుంది. ఒక ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్థాపించి మంచి మంచి సినిమాలు తీయడానికి రెడీ అవుతోంది. ఇక ఇది కాకుండా నందమూరి వంశంలోని ఇప్పటివరకు చేయనిది.. మొదటిసారి తేజస్విని చేయబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం తేజస్విని యాక్టింగ్ బాట పట్టనుంది.
తేజస్విని హైదరాబాద్‌లో ఉన్న ఒక ప్రతిష్టాత్మక జ్యూవెలరీ బ్రాండ్‌కు ప్రచారకర్తగా వ్యవహరించనుంది. దానికోసం ఆమె ఒక యాడ్ షూట్ లో కూడా పాల్గొంది. ఈ యాడ్ షూట్ కోసమే ఆమె మేకప్ వేసుకుంది. ఈ మధ్యనే ఈ షూట్ కూడా ఫినిష్ అయ్యిందని సమాచారం. మొట్ట మొదటిసారి ఆమె కెమెరా ముందుకు వచ్చి నటించబోతుంది. ఇది కనుక విజయం అయితే .. ముందు ముందు టాలీవుడ్ లో కూడా తేజస్విని కనిపించే అవకాశాలు ఉన్నాయని సన్నిహిత వర్గాలు చెప్పుకొస్తున్నాయి. మరి బాలయ్య కుమార్తె మొట్టమొదటి ఆన్-కెమెరా వెంచర్ షోస్టాపర్‌గా నిలుస్తుందో లేదో చూడాలి.
Vijay Devarakonda: పెళ్లి కొడుకు కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తుందే..
Chiranjeevi: మన శంకర వరప్రసాద్ గారు.. కుర్రాడిలా ఫోజులిచ్చారు