Nandamari Balakrishna: బాలయ్య గొప్ప మనసు.. సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు సాయం
ABN , Publish Date - Aug 30 , 2025 | 10:03 PM
నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) కూడా తన గొప్ప మనసును చాటుకున్నారు.
Nandamari Balakrishna: తెలుగు హీరోల మీద ఎందుకు అంత అభిమానం అందరికీ.. మిగతా హీరోల మీద ఎందుకు ఉండదు అంటే.. అభిమానులకే కాదు తమ ప్రజలకు కష్టమొచ్చింది అని తెలిస్తే చాలు.. తెలుగు హీరోలే మొదట అండగా నిలబడతారు. ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా.. మేము ఉన్నాము అని ధైర్యాన్ని అందిస్తారు. అభిమానులను సొంత కుటుంబంగా చూసుకుంటారు. మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).. ఏపీ వరదల కారణంగా నిరాశ్రుయులైన కుటుంబాలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్ కు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన విషయం తెల్సిందే. ఇక ఇప్పడూ నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) కూడా తన గొప్ప మనసును చాటుకున్నారు.
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బాలయ్య చోటు సంపాదించుకున్న విషయం తెల్సిందే. తాజాగా ఆయనకు సంస్థ ప్రతినిధులు సర్టిఫికెట్ అందించడమే కాకుండా సన్మానం కూడా చేశారు. ఇక ఈ వేదికపై బాలయ్య గురించి ఎంతోమంది ప్రముఖులు మాట్లాడారు. చివరకు బాలయ్య మాట్లాడుతూ.. వరద బాధితులను గుర్తుచేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టించింది.పంటలు నాశనం అయ్యాయి… ముందుగా బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి అంటూ స్పీచ్ మొదలుపెట్టారు.
అనంతరం.. బాలయ్య.. వర్షాలు, వరదల కారణంగా తెలంగాణలో నష్టపోయినవారికి తనవంతు సాయంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు విరాళంగా ప్రకటించారు. ' ఇది ఇప్పుడు చెప్తే అతిశయోక్తి అవుతుందేమో.. అందరు ఉన్నారని చెప్తున్నాను అనుకుంటున్నారేమో కానీ, ఇది నా సొంత బాధ. తెలంగాణలోని జగిత్యాల, కామారెడ్డి జిల్లాలో వర్ష బీభత్సం వలన ఎంతోమంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇంకెంతోమంది రైతులు పండించిన పంట నేలమట్టమయ్యింది. వాళ్లందరికీ ఉడతాభక్తిగా నేను సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 50 లక్షలు ప్రకటిస్తున్నాను. దాంతో వాళ్ల అవసరాలు తీరవు. ముందు ముందు వారికి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా.. చేస్తాను. ఇంకా ఏది కావాలన్నా నా అభిమానులు కూడా ఉన్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేస్తారు. ఎలాంటి లాభాపేక్ష అవసరం లేదు.. ప్రజలు ముఖ్యం' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Pawan Singh: అందరి ముందు నడుము తాకిన హీరో.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న హీరోయిన్
Rajinikanth: రజినీ నోట.. బాలయ్య డైలాగ్.. అదిరిపోయిందంతే