Pawan Singh: అందరి ముందు నడుము తాకిన హీరో.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న హీరోయిన్
ABN , Publish Date - Aug 30 , 2025 | 09:27 PM
స్టార్ డమ్ వచ్చాక కొందరు ఎలా ప్రవర్తిస్తున్నారో వారికే అర్ధం కావడంలేదు. ఎవరిముందు ఉన్నాం.. ఎక్కడ ఉన్నాం అనే స్పృహ కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు.
Pawan Singh: స్టార్ డమ్ వచ్చాక కొందరు ఎలా ప్రవర్తిస్తున్నారో వారికే అర్ధం కావడంలేదు. ఎవరిముందు ఉన్నాం.. ఎక్కడ ఉన్నాం అనే స్పృహ కూడా లేకుండా బిహేవ్ చేస్తున్నారు. తాజాగా భోజ్ పురి స్టార్ హీరో పవన్ సింగ్ (Pawan Singh) కొత్త వివాదానికి తెరలేపాడు. స్టార్ హీరో అంటే ఎలా ఉండాలి అనేదాన్ని మరచి అందరూ చూస్తుండగా.. స్టేజిపై మాట్లాడుతున్న హీరోయిన్ నడుమును అసభ్యంగా తాకి నానా రచ్చ చేశాడు. లక్నోలో సైయా సేవా కరే సాంగ్ ప్రమోషన్స్ లో హీరోయిన్ అంజలి రాఘవ్ (Anjali Raghav) తో కలిసి పవన్ సింగ్ పాల్గొన్నాడు. అంజలి మైక్ పట్టుకొని మాట్లాడుతుండగా.. పక్కనే ఉన్న పవన్.. ఆమె నడుమును అసభ్యంగా తాకడం ప్రారంభించాడు. అంజలి వద్దని ఆపుతున్నా కూడా అతను ఆగలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇక మీడియాలో హీరో చేసిన తప్పును పక్కన పెట్టి.. హీరోయిన్ పై ట్రోల్స్ మొదలయ్యాయి. హీరో తాకుతుంటే ఆపకుండా ఆమెకూడా ఎంజాయ్ చేస్తుంది. ఛీఛీ ఇదేం పాడుబుద్ది అంటూ ఆమెపై లేనిపోని ఆరోపణలు చేసారు. తాజాగా అంజలి.. ఈ ట్రోల్స్ పై స్పందించింది. ఇదంతా అబద్దమని, తానేమి ఎంజాయ్ చేయలేదని, అది తనకు చాలా బాధ అనిపించిందని కన్నీరు పెట్టుకుంది. ఆ సమయంలో తాను ఏం చేయలేకపోయానని, ఎందుకంటే అది తన సొంత ఊరు కాదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఒక షాకింగ్ డెసిషన్ ను కూడా తీసుకుంది.
'కొందరు నన్ను తప్పు పడుతున్నారు. నాపై ట్రోల్స్ చేస్తున్నారు. ఆమె కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది అని అంటున్నారు. ఆడపిల్లకి అనుమతి లేకుండా తాకితే నవ్వొస్తుందా.. ఎంత ఏడ్చానో నాకే తెలుసు. నేను మాట్లాడుతుండగా పవన్ సింగ్ .. నా నడుమును తాకుతూ అక్కడ ఏదో ఉంది అన్నాడు. నేను నా జాకెట్ ట్యాగ్ ను తీయడం మర్చిపోయానేమో అనుకోని.. అయ్యో ట్యాగ్ తీయడం మర్చిపోయానా అని అడిగాను. అందుకే నవ్వాను. ఆ తరువాత లోపలి వెళ్లి చూస్తే .. అక్కడ ఏమి లేదు. అప్పుడే నాకు కోపం, బాధ తన్నుకువచ్చాయి.
ఇంత చేసినా నేను అతనిని ఏమి చేయలేను. అతడు అక్కడ స్టార్. అది నా ఊరు కూడా కాదు. అదే మా సొంత ఊరు అయితే.. ప్రజలే అతడికి బుద్ది చెప్పేవారు. ఇకపై నేను భోజ్ పురి సినిమాల్లో నటించను' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ వివాదంపై పవన్ సింగ్ ఇప్పటివరకు స్పందించింది లేదు.
Sunday Tv Movies: ఆదివారం, ఆగస్టు 31.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలివే
Arudra: చెరిగిపోని ఆరుద్ర ముద్ర...