Lakshmi Narasimha: రీరిలీజ్‌లో కొత్త ట్రెండ్ సృష్టించిన బాలయ్య

ABN , Publish Date - Jun 05 , 2025 | 09:47 PM

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా జయంత్ సి పరాన్జీ(Jayanth C. Paranjee) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీ నరసింహా.

Nandamuri Balakrishna

Lakshmi Narasimha: టెక్నాలజీతో రోజురోజుకూ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నారు టాలీవుడ్ మేకర్స్. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో తీసిన సినిమాలను కలర్ లోకి తీసుకొచ్చారు. ఆ తరువాత పాత సినిమాలను 4k లో రీరిలీజ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి.. పాత సినిమాల్లో కొత్తగా సాంగ్స్ ను యాడ్ చేయడం మొదలుపెట్టి కొత్త ట్రెండ్ ను సృష్టించారు. ఈ ట్రెండ్ కు నాంది పలికింది లక్ష్మీ నరసింహా(Lakshmi Narasimha) సినిమా.

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా జయంత్ సి పరాన్జీ(Jayanth C. Paranjee) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం లక్ష్మీ నరసింహా. బెల్లంకొండ సురేష్(Bellamkonda Suresh) నిర్మించిన ఈ చిత్రంలో ఆసిన్(Asin) హీరోయిన్ గా నటించింది. 2004 లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలోని డైలాగ్స్, సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటాయి. నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా 21 ఏళ్ల తరువాత లక్ష్మీ నరసింహా సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. జూన్ 8 న ఈ సినిమా రీరిలీజ్ కు రెడీ అయ్యింది.

ఇప్పటివరకు రీరిలీజ్ సినిమా వస్తుంది అంటే కొత్తగా ట్రైలర్ ను కట్ చేసి రిలీజ్ చేసేవారు. కానీ, ఈ సినిమాకు మాత్రం ఏకంగా ఒక కొత్త సాంగ్ నే రూపొందించారు. లక్ష్మీ నరసింహా సినిమాలోనే బాలకృష్ణ క్యారెక్టర్ ను రివీల్ చేసే సాంగ్ ఒకటి రూపొందించారట. షూటింగ్ కూడా చేసినా ఆ సాంగ్ కాకుండా వేరే సాంగ్ ను పెట్టడంతో ఈ విజువల్స్ ను అలాగే ఉంచేశారు. ఇప్పుడు బెల్లంకొండ సురేష్.. వాయిస్ లేని బాలయ్య డ్యాన్స్ కు కొత్తగా సాంగ్ రాయించి.. దానికి మ్యాచ్ చేశారు.

తాజాగా ఈ కొత్త సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మందేసినోడు మంచోడు.. మ్యాన్షన్ హౌస్ వేసినాడు మహానుభావుడు అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చంద్రబోస్(Chandra Bose) అందించిన లిరిక్స్ అన్ని.. బాలయ్యకు కరెక్ట్ గా సూట్ అవుతాయని చెప్పచ్చు. ఇక భీమ్స్(Bheems) మ్యూజిక్ అందించగా.. స్వరాగ్ కీర్తన్ అద్భుతంగా ఆలపించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. సాంగ్ చివర్లో జై బాలయ్య అంటూ వచ్చిన స్లొగన్స్.. థియేటర్ లో రచ్చ రేపుతాయి అని చెప్పొచ్చు. ఇక ఈ నయా ట్రెండ్ ను మిగతా మేకర్స్ కూడా ప్రయత్నిస్తారేమో చూడాలి.


ఇవి కూడా చ‌ద‌వండి..

ఓ రోజు ముందే తెలుగులోనూ ఓటీటీకి వ‌చ్చిన‌.. అదిరిపోయే హిందీ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్

స‌డ‌న్‌గా ఓటీటీకి.. స్పైన్ చిల్లింగ్ స‌ర్వైవ‌ల్ హ‌ర్ర‌ర్‌థ్రిల్ల‌ర్‌! ఎందులో చూడాలంటే

ఆరేండ్ల త‌ర్వాత తెలుగులో.. ఓటీటీకి వ‌చ్చిన దుల్క‌ర్ స‌ల్మాన్ కామెడీ థ్రిల్ల‌ర్

రెండు నెల‌ల త‌ర్వాత ఓటీటీకి.. స‌ప్త‌గిరి పెళ్లి కాని ప్ర‌సాద్! ఎందులో అంటే

స‌డ‌న్‌గా ఓటీటీకి.. హాలీవుడ్ లేటెస్ట్ బోల్డ్‌, హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్‌! ఎందులో చూడాలంటే

స‌డ‌న్‌గా.. ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన శ్రీవిష్ణు సింగిల్‌! ఎందులో అంటే

Updated Date - Jun 06 , 2025 | 10:06 AM