Deepavali: ఎట్టకేలకు అక్టోబర్ 10న 'ఎర్రచీర'
ABN , Publish Date - Sep 24 , 2025 | 06:20 PM
కారుణ్య చౌదరి హీరోయిన్ గా నటించిన 'ఎర్రచీర' సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. సుమన్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్వినీ కీలక పాత్ర పోషించింది.
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) మనవరాలు బేబీ సాయి తేజస్విని నటించిన సినిమా 'ఎర్రచీర' (Erracheera). సుమన్ బాబు (Suman babu) స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను పోషించిన సినిమా ఇది. మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు దీపావళి కానుకగా అక్టోబర్ 10న విడుదల కాబోతోంది. ఇటీవల ఈ సినిమా బిజినెస్ షో చూసిన పంపిణీదారులంతా మూవీపై పాజిటివ్ ఒపీనియర్ వెలిబుచ్చారని, డివోషనల్ టచ్ ఉన్న ఈ సినిమాను దీపావళికి విడుదల చేయడం సబబుగా ఉంటుందని చెప్పడంతో అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నామని సుమన్ బాబు చెప్పారు.
ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తి చేసుకుందని, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ 'ఎర్రచీర'కు హైలైట్ గా నిలుస్తాయని సుమన్ బాబు తెలిపారు. సినిమా విడుదలలో జాప్యం జరిగినా కంటెంట్ ఫ్రెష్ గా ఉంటుందని, హారర్ బ్యాక్ డ్రాప్ లో మదర్ సెంటిమెంట్ తో తీసిన ఈ లేడీ ఓరియేంటెడ్ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన అన్నారు. 'ఎర్ర చీర' ప్రమోషన్స్ లో భాగంగా 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) డైరెక్టర్ జ్యోతి కృష్ణను కలిసి సినిమా ట్రైలర్ ను చూపించారు. 'ఎర్ర చీర ట్రైలర్ చాలా బాగుందని, అందరూ తప్పకుండా థియేటర్లలలో చూడాల'ని జ్యోతికృష్ణ కోరారు. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ సినిమాలో సుమన్ బాబుతో పాటు శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పి. శర్మ, సురేశ్ కొండేటి, రఘుబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రమోద్ పులిగర్ల స్వరాలు సమకూర్చగా, ఎస్. చిన్నా నేపథ్య సంగీతం అందించారు. ఈ సినిమా ఎన్.వి.వి. సుబ్బారెడ్డి, సిహెచ్. వెంకట సుమన్ నిర్మించారు.
Also Read: Krithi Shetty: ఉప్పెన భామ.. హిట్ అందుకొనే తరుణం ఎప్పుడో
Also Read: Zubeen Garg: జుబీన్ గార్గ్‌కు హీరోయిన్ భైరవి నివాళి