సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kubera: సెన్సార్ కత్తెరకు పదును పెట్టిన కుబేర

ABN, Publish Date - Jun 18 , 2025 | 06:08 PM

నాగార్జున, ధనుష్, రశ్మిక మందణ్ణ ప్రధాన పాత్రలు పోషించిన 'కుబేర' ఈ నెల 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. యుఎ సర్టిఫికెట్ కోసం మేకర్స్ ఏకంగా 13 నిమిషాల నిడివిని కోల్పోడానికి సిద్థపడ్డారని సమాచారం.

కింగ్ నాగార్జున (Nagarjuna) కీలక పాత్ర పోషిస్తున్న సినిమా 'కుబేర' (Kubera). ధనుష్ (Dhanush), రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ 20వ తేదీ ఐదు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. శేఖర్ కమ్ముల (Sekhar Kammula) తెరకెక్కించిన ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను చాలా రోజుల క్రితమే పూర్తి చేసుకుంది. సెన్సార్ సర్టిఫికెట్ లో ఈ మూవీని 'శేఖర్ కమ్ములాస్ కుబేర'గా పేర్కొన్నారు.


'కుబేర' చిత్రాన్ని సెన్సార్ కు అప్లయ్ చేసినప్పుడు దాని నిడివి 195. 25 నిమిషాలు. అయితే సెన్సార్ కత్తెర కు సభ్యులు పదును పెట్టి విపరీతంగా కట్ చేయడంతో అందులోంచి 13 నిమిషాల నిడివిని తీసేయాల్సి వచ్చింది. ఒక పాటలో ఏకంగా మూడు నిమిషాల సన్నివేశాలకు సెన్సార్ వారు అభ్యంతరం వ్యక్తం చేశారట. దాంతో సినిమా చివరకు 181. 46 నిమిషాలకు కుదించబడింది. అయినా కూడా మూడు గంటల పైన ఉన్నట్టే. చిత్రం ఏమంటే.. 'కుబేర' వెనకే రాబోతున్న మరో తెలుగు పాన్ ఇండియా మూవీ 'కన్నప్ప' సైతం మూడు గంటలకు పైనే ఉందని తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ వస్తున్న ఈ మూడు గంటల పైబడి ఉన్న చిత్రాలు ప్రేక్షకులను ఏ మేరకు సీట్లో ఓపికగా కూర్చోపెడతాయో చూడాలి.


'కుబేర' విషయానికి వస్తే... ఈ సినిమాలో కథాంశం చాలా చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతూ సాగుతుందని అంటున్నారు. అత్యంత ధనవంతుడు, రోడ్డు మీద అడుక్కునే వాడు, మధ్యలో నడమంత్రపు సిరి పొందిన ఓ వ్యక్తి. ఈ మూడు పాత్రల మధ్య కథ సాగుతుందని తెలుస్తోంది. భారత ప్రభుత్వాన్ని ఓ బిచ్చగాడు సవాల్ చేయడం అనే అంశం ఇందులో ప్రధానమైనది అంటున్నారు. అందవల్లే సెన్సార్ సభ్యులు మరింత కాన్షస్ తో మూవీని చూశారని, చాలా సన్నివేశాలకు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిసింది. అలానే దర్శక నిర్మాతలు యు/ఎ సర్టిఫికెట్ కావాలని పట్టుబట్టిన కారణంగానూ 19 కట్స్ కు వారు అంగీకరించాల్సి వచ్చిందట. చివరకు సెన్సార్ సభ్యులు చెప్పిన కట్స్ కు ఆమోదం తెలిపిన తర్వాత యు/ఎ 13 ప్లస్ సర్టిఫికెట్ ను జారీ చేశారు. 'ఫిదా' సినిమా వరకూ క్లీన్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించిన శేఖర్ కమ్ముల గత చిత్రం 'లవ్ స్టోరీ' నుండి రూట్ మార్చారు. సున్నితమైన, వివాదాస్పదమైన అంశాలను కథాంశాలుగా తీసుకుని మూవీస్ తీస్తున్నారు. 'కుబేర'లో సైతం సిస్టమ్ ను ప్రశ్నించే అంశాలు అనేకం ఉండటంతో ఈ సినిమా బాగానే సెన్సార్ బృందానికి పని చెప్పిందని తెలుస్తోంది.

Also Read: Samantha: నాగ చైతన్యను కలిసేదే లేదు..  క్లారిటీ ఇచ్చిన సామ్ 

Also Read: Lenin Movie: పరువు హత్యల నేపథ్యంలో.. అక్కినేని హీరో.. ?

Updated Date - Jun 18 , 2025 | 06:09 PM