Rashmika Mandanna: ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా మాట్లాడాలో అప్పుడే మాట్లాడతా
ABN , Publish Date - Dec 04 , 2025 | 10:53 AM
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) పెళ్లి గురించే ఇప్పుడు చర్చ అంతా. పెళ్లి గురించి ఆమె ఏం చెప్పిందంటే
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) పెళ్లి గురించే ఇప్పుడు చర్చ అంతా. ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక ఈ విషయంపై స్పందించారు. (rashmika Marriage)
‘వ్యకిగత జీవితం గురించి బయటపెట్టడానికి నేను ఇష్టపడను. పర్సనల్ లైఫ్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటాను. ఇంట్లో ఉన్నప్పుడు వర్క్ గురించి మాట్లాడను. బయటకు వచ్చినప్పుడు పర్సనల్ వర్క్ గురించి మాట్లాడను. నేను చేసే ప్రతి పని వెనుక ఓ ప్రణాళిక ఉంటుంది. పెళ్లి వార్తలను ఇప్పుడే ధ్రువీకరించలేను. అలాగని ఖండించనూ లేను. పెళ్లి గురించి ఎప్పుడు, ఎక్కడ మాట్లాడాలో అప్పుడు మాట్లాడతాను. కచ్చితంగా మీ అందరితో పంచుకుంటాను. అంతకుమించిన వివరాలు ఏమీ చెప్పలేను’ అన్నారు.
ఇక సినిమా విషయానికొస్తే ‘అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఉన్నట్టుండి వాయిదా పడొచ్చు. రిహార్సల్స్ కారణంగా షూట్ ఆలస్యం కావచ్చు. నేను డబుల్ షిఫ్ట్‌లు చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. నటీనటులు ఎప్పుడూ పనిలో నిమగ్నమై ఉండాలి. ఈ ఏడాది నాకు ఎంతో ప్రత్యేకమైనది. ఐదు సినిమాలు విడుదలై ఆదరణ పొందాయి. ఇండస్ర్టీలో మంచి స్థానం సంపాదించాలంటే ఎంతో కష్టపడాలి. విజయ ఓవర్‌నైట్ రాదు. నేను ఎలాంటి కథకైనా న్యాయం చేయగలనని ప్రేక్షకులకు తెలియడానికి కాస్త సమయం పట్టింది. భాషాపరమైన, జానర్‌లకు సంబంధించిన ఎలాంటి హద్దులు లేకుండా అన్నిరకాల సినిమాల్లో నటించాలని ఇండస్ర్టీకి వచ్చిన సమయంలోనే అనుకున్నా. ఈఏడాది నేనుచచ నటించిన ప్రతి కథ భిన్నమైనదే! ఆ సినిమాల్లో నటనకు ఫ్యాన్స్ చప్పట్లు కొడుతుంటే చాలా ఆనందంగా ఉంది. నరుటో కార్టూన్ అంటే నాకు ఎంతో ఇష్టం. దాని చూస్తూ విశ్రాంతి పొందుతాను. ’ అని అన్నారు.