Shyaamali: ఆ పెళ్లి గురించి కొంచెం కూడా ఆలోచించలేదు..

ABN , Publish Date - Dec 04 , 2025 | 11:59 AM

రాజ్‌ నిడిమోరు, సమంత వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్‌ మాజీ భార్య శ్యామాలి ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు.

రాజ్‌ నిడిమోరు(Raj nidimoru) సమంత (Samantha) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్‌ 1న కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో ఉన్న లింగ భైరవి దేవాలయంలో భూత శుద్ధి వివాహం చేసుకున్నారీ జంట. ఈ నేపథ్యంలో రాజ్‌ మాజీ భార్య శ్యామాలి (Shyamali) ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించారు. తాను ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వనని పేర్కొన్నారు. ఎవరి సానుభూతి కోసం పాకులాడటం లేదని శ్యామాలి పేర్కొన్నారు.  


‘నా నుంచి బ్రేకింగ్‌ న్యూస్‌లు, ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలు ఆశించవద్దు. సమంత - రాజ్‌ నిడిమోరు వివాహం చేసుకున్న తర్వాత అందరూ నాపై జాలి చూపిస్తున్నారు.  కానీ నేను ఆ విషయానిన కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉన్నాయి. కానీ నేను ప్రస్తుతం ఎలాంటి విషయాల గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేను.

Shyaamali.jpg

ఎందుకంటే మా గురువు క్యాన్సర్‌ బారిన పడినట్లు ఇటీవల తెలిసింది. నేను ఆయన కోసం ప్రార్థిస్తున్నాను. నేను మా గురువు గురించి ఆలోచిస్తూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నా. ఆ కారణంగా మీ అందరికీ స్పందించలేను. నా బాధను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా నాపై సానుభూతి చూపాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను’ పోస్ట్‌లో పేర్కొన్నారు.  

WhatsApp Image 2025-12-04 at 8.47.00 AM (1).jpeg

Updated Date - Dec 04 , 2025 | 01:16 PM