Nagababu: గుర్తుపట్టలేకుండా మారిపోయిన నాగబాబు.. ఏమైంది
ABN, Publish Date - Jul 11 , 2025 | 09:45 PM
మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు, రాజకీయాలు అంటూ నాగబాబు కూడా బిజీగా మారాడు. జనసేన పార్టీలో తమ్ముడు పవన్ కి తోడుగా ఉంటూ వస్తున్నాడు.
Nagababu: మెగా బ్రదర్ నాగబాబు (Nagababu) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలు, రాజకీయాలు అంటూ నాగబాబు కూడా బిజీగా మారాడు. జనసేన పార్టీలో తమ్ముడు పవన్ కి తోడుగా ఉంటూ వస్తున్నాడు. ఇక నాగబాబు మెగా బ్రదర్స్ మీద మాట కూడా పడనివ్వడు అనే విషయం అందరికీ తెల్సిందే. ట్రోల్స్ ఎన్ని వచ్చినా వాటికి కౌంటర్ ఇస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటాడు. త్వరలోనే నాగబాబు తాత కాబోతున్న విషయం తెల్సిందే. వరుణ్ తేజ్ భార్య నటి లావణ్య త్రిపాఠి గర్భవతిగా ఉన్న విషయం విదితమే.
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నాగబాబు.. తాజాగా ఒక ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఈ ఫోటోలో నాగబాబు లుక్ చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. ఒకప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండే నాగబాబు.. ఈసారి బక్కచిక్కి కనిపించాడు. ఈమధ్యనే నాగబాబు జిమ్ లో కసరత్తులు చేస్తూ వస్తాద్ లా బాడీ పెంచి ఫోటోషూట్ కూడా చేశాడు. నాగబాబు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ చూసి విలన్ గా బాగా సెట్ అవుతాడు అని కూడా కామెంట్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ, నాగబాబు లుక్ మొత్తం మారిపోయింది.
ఈ ఫొటోలో నాగబాబు బుగ్గలు మొత్తం లోపలి పోయి, తోలు కనిపిస్తూ చాలా అనారోగ్యంగా ఉన్నట్లు కనిపించాడు. సడెన్ గా ఆయనను చూస్తే పేషేంట్ అనుకుంటారు అని అనడంలో ఆశ్చర్యం లేదు. ఇక దీంతో మెగా ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగబాబుకు ఏమైంది.. ? ఎందుకు ఇలా అయిపోయాడు అని ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అనారోగ్యం వలన ఇలా చిక్కిపోయాడా.. ? వయస్సు పైబడడం వలన ఇలా మారాడా.. ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నాగబాబు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం నాగబాబు జబర్దస్త్ కి రీఎంట్రీ ఇచ్చాడు. నాగబాబుకు అంత గుర్తింపు తీసుకొచ్చిన షో ఏదైనా ఉంది అంటే అది జబర్దస్త్ కామెడీ షో అనే చెప్పాలి. ఆ షోలో నాగబాబు నవ్వుకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక 20 ఏళ్ళ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో నాగబాబు మళ్లీ మెరిశాడు. అయితే కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కి మాత్రమే జడ్జిగా వచ్చాడా.. ? లేకపోతే మళ్లీ జబర్దస్త్ లో కంటిన్యూ అవుతాడా..? అనేది తెలియాల్సి ఉంది. ఇంకోపక్క నాగబాబు ఆరోగ్యం కోలుకోవాలని కొందరు అభిమానులు కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Kajal Aggarwal: కాజల్ అందం ముందు.. సాయి పల్లవి ఎంత