Naga Vamsi: నాగవంశీ కూడా భార్యా బాధితుడేనా..
ABN , Publish Date - Sep 08 , 2025 | 08:36 PM
ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసిన నిర్మాతలు కూడా ప్రేక్షకులకు తెలిసేవారు కాదు. కానీ, సోషల్ మీడియా వచ్చాకా నిర్మాతలకు కూడా ఫ్యాన్ బేస్ ఉంది.
Naga Vamsi: ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తీసిన నిర్మాతలు కూడా ప్రేక్షకులకు తెలిసేవారు కాదు. కానీ, సోషల్ మీడియా వచ్చాకా నిర్మాతలకు కూడా ఫ్యాన్ బేస్ ఉంది. దిల్ రాజు (Dil Raju), నాగ వంశీ (Naga Vamsi), అల్లు అరవింద్ (Allu Aravind).. ఇలా నిర్మాతలు కూడా మంచి గుర్తింపును తెచ్చుకుంటున్నారు. అయితే తమ సినిమాలకు హీరో హీరోయిన్, డైరెక్టర్ కాకుండా నిర్మాతలు కూడా ప్రమోషన్ ఇంటర్వ్యూలకు రావచ్చు అని చూపించిందే నాగ వంశీ.
ఇక ప్రస్తుతం నాగ వంశీ విజయపజయాల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. గత కొన్ని చిత్రాలు ఆయనను భారీగా ముంచేశాయి. ప్రస్తుతం విజయం కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక కినిమాల విషయం పక్కన పెడితే.. నేడు నాగ వంశీ భార్య స్నిగ్ధ పుట్టినరోజు. దీంతో నాగ వంశీ.. భార్యకు స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. సాధారణంగా సెలబ్రిటీలు తమ భార్యల గురించి చెప్పమంటే.. ఆమె లేనిదే నేను లేను. ఆమె నా ప్రాణం అంటూ చెప్పుకోస్తారు. కానీ, వంశీ మాత్రం గబ్బర్ సింగ్ స్టైల్లో చెప్పుకొచ్చాడు.
గబ్బర్ సింగ్ అంటే.. పవన్ పాడినట్లు ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే అని పాడాడా ఏంటి అనుకొనేరు. అంతా కవిత్వం చెప్పకుండా చలా సింపుల్ గా, ఏ భర్త అయినా కోరుకొనే కోరికనే చెప్పుకొచ్చాడు. గబ్బర్ సింగ్ లో పవన్, శృతిని పెళ్లి చేసుకొని.. నువ్వు సుఖంగా ఉండు.. నన్ను సుఖంగా ఉంచు అనే డైలాగ్ ను నాగ వంశీ కొద్దిగా మార్చి.. 'హ్యాపీ బర్త్ డే .. నువ్వు సుఖంగా ఉండి.. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు ' అంటూ రాసుకొచ్చాడు. దీంతో అభిమానులు.. ఏంటన్నా నువ్వు కూడా భార్యా భాదితుడివేనా.. పెళ్లి అయ్యాకా ఎవరు ప్రశాంతంగా ఉంటారులే అన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mega Heroes: ఒకే ఫ్రేమ్ లో బాబాయ్- అబ్బాయ్ తో అల్లు అర్జున్..
Rana Daggubati: రూట్ మార్చిన దుగ్గబాటి హీరో...