Mega Heroes: ఒకే ఫ్రేమ్ లో బాబాయ్- అబ్బాయ్ తో అల్లు అర్జున్..
ABN , Publish Date - Sep 08 , 2025 | 07:14 PM
మెగా - అల్లు కుటుంబాల మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెల్సిందే.
Mega Heroes: మెగా - అల్లు కుటుంబాల మధ్య ఎప్పటినుంచో కోల్డ్ వార్ నడుస్తున్న విషయం తెల్సిందే. కారణాలు ఏంటి అనేవి ఎవరికీ తెలియదు. కానీ, అంతకుముందులా మెగా - అల్లు కుటుంబాలు లేవు అన్న మాట వాస్తవం. ఎవరి బిజీల్లో వాళ్లు ఉన్నారు. కలిసే సమయంలో కలుస్తారు అని అల్లు అరవింద్ చెప్పుకుంటూ వచ్చినా అది కొంతవరకే నిజమని తెలుస్తోంది. ఒకప్పుడు ప్రతి పండగకు అల్లు - మెగా కుటుంబాలు కలిసి సెలబ్రేట్ చేసుకొనేవారు. ఆ ఫోటోల కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూసేవారు.
మెగా - అల్లు మద్య ఉన్న కొద్ది బంధం.. అల్లు అర్జున్.. వేరే పార్టీకి మద్దతు ప్రకటించడంతో పోయింది. స్వంత మామ పవన్ ను కాదని.. బన్నీ, భార్య స్నేహితుడు అయిన వ్యక్తికి సపోర్ట్ గా నిలవడం అప్పట్లో పెను దూమరాన్నే రేపింది. ఆ దుమారం చిలికి చిలికి.. గాలివానలా మారి.. మెగా కజిన్స్ మధ్య దూరాన్ని మరింత పెంచింది. ఆ తరువాత చాలా జరిగాయి. అయితే ఇంత జరిగాకా మెగా - అల్లు కుటుంబాలు కలిసి కనిపించడం కష్టమే అనుకున్నారు. కానీ, అల్లు కనకరత్నమ్మ వారందరినీ కలిపింది.
అల్లు అరవింద్, కొణిదెల సురేఖ తల్లి అల్లు కనకరత్నం ఈ మధ్యనే మృతిచెందిన విషయం తెల్సిందే. ఆమె మరణం.. ఈ రెండు కుటుంబాలను కలిపింది. ఆమె మరణవార్త విన్న.. అల్లు అర్జున్, రం చరణ్, చిరంజీవి, మిగతా మెగా కజిన్స్ అందరూ హుటాహుటిన అల్లు వారింటికి చేరుకున్నారు. చిరు - అరవింద్ నే ఆ కార్యక్రమాలను దగ్గరుండి చూసకున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, చిరంజీవి.. కనకరత్నం పాడె మోశారు. చాలా గ్యాప్ తరువాత ఈ రెడను కుటుంబాలు కలవడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ వారి ఫోటోలతో షేక్ అయ్యింది. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ వేరే కారణాల వలన రాలేకపోయారు.
ఇక నేడు కనకరత్నం దశదిన కర్మ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్, వారసుడు అకీరా హాజరయ్యి కనకరత్నమ్మకు నివాళులు అర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ తో కొద్దిసేపు ముచ్చటించారు. కార్యక్రమం మొదటి నుంచి పవన్ బాబాయ్ పక్కనే అబ్బాయ్ రామ్ చరణ్ కూడా ఉన్నాడు. బాబాయ్- అబ్బాయ్ తో అల్లు అర్జున్ ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సింగిల్ ఫ్రేమ్ లో వీరి ముగ్గురిని చూసిన అభిమానులు ఎన్నాళ్లయ్యింది వీరిని ఇలా చూసి అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Andhra King Taluka: రామ్ పాడిన పాట వచ్చేసింది.. విన్నారా
Teja Sajja: అన్నీ కష్టాలే.. ఓ పెద్ద వ్యక్తే నమ్మించి మోసం చేశాడు..