Akkineni Nagarjuna: నాగార్జున 100.. మరో మనం అవుతుందా
ABN, Publish Date - Sep 18 , 2025 | 04:29 PM
అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ ఏడాది తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు. హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్ తో పాటు విలన్ గా కూడా కనిపించి అలరించాడు.
Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఈ ఏడాది తనలోని కొత్త కోణాన్ని బయటపెట్టాడు. హీరోగానే కాకుండా సపోర్టింగ్ రోల్ తో పాటు విలన్ గా కూడా కనిపించి అలరించాడు. ఇక ఆ రెండు సినిమాలు మంచి విజయాన్ని దక్కించుకొని నాగ్ రేంజ్ ను మరింత పెంచాయి. అయితే ఈ పాత్రలు చేయడంతో నాగ్.. ఇలాంటి పాత్రలకే పరిమితం అవుతాడని లేదు. ప్రస్తుతం నాగ్ తన 100 వ సినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఇక నాగార్జున 100 వ సినిమా గురించి సోషల్ మీడియాలో ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. చాలామంది స్టార్ డైరెక్టర్స్ తో కథా చర్చల తరువాత చివరికి నాగ్.. తన 100 వ సినిమాను తెరకెక్కించే బాధ్యతలను కోలీవుడ్ డైరెక్టర్ రా. కార్తీక్ చేతిలో పెట్టాడు. ఆయనేమి అంత పెద్ద డైరెక్టర్ కాదు. ఆకాశం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఆ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందుకోలేదు. అలాంటి డైరెక్టర్ ను నమ్మి నాగ్ తన 100 వ సినిమాను చేయడం ఫ్యాన్స్ కు ఆశ్చర్యంగా ఉన్నా.. కథను నమ్మి సినిమాలు తీసే నాగ్ ఏదో మంచి పాయింట్ ఉండడంతోనే ఛాన్స్ ఇచ్చి ఉంటాడని అనుకోవడం మొదలుపెట్టారు.
ఇక నాగ్ - కార్తీక్ సినిమా త్వరలోనే పూజా కార్యక్రమాలతో మొదలు కానుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేయనున్నారని తెలుస్తోంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అక్కినేని కుర్ర హీరోలు కూడా కనిపించనున్నారని తెలుస్తోంది. అక్కినేని నాగ చైతన్య, అఖిల్ మరోసారి తన తండ్రి సినిమాలో క్యామియోస్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరు ముగ్గురు కలిసి మనం సినిమాలో నటించారు. ఆ తరువాత కొడుకుల సినిమాల్లో తండ్రి క్యామియోగా కనిపించాడు. ఇక ఇప్పుడు మనం తరువాత తండ్రి కోసం కొడుకులు ఇద్దరూ ఈ సినిమాలో నటించి నాగ్ 100 వ సినిమాను స్పెషల్ గా మార్చబోతున్నారు. ఈ విషయం తెలియడంతో అక్కినేని ఫ్యాన్స్.. ఈ సినిమా మరో మనం అవ్వబోతుందా అని కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
OG Movie: ఫ్యాన్స్ ఓపిక పట్టండి.. ట్రైలర్ వచ్చేస్తుంది
Deepika Padukone.: అల్లు అర్జున్ సినిమానే కారణమా...