Mowgli: జయం.. అహింస కలిపి కొట్టినట్లుందే..
ABN, Publish Date - Aug 29 , 2025 | 07:07 PM
ఈ మధ్యకాలంలో కొత్త కథలు రావడం లేదు. అయితే సినిమాలు ఎలా హిట్ అవుతున్నాయి అంటే.. కథలు పాతవి అయినా చూపించే విధానం అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.
Mowgli: ఈ మధ్యకాలంలో కొత్త కథలు రావడం లేదు. అయితే సినిమాలు ఎలా హిట్ అవుతున్నాయి అంటే.. కథలు పాతవి అయినా చూపించే విధానం అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. లవ్ స్టోరీస్ అన్ని ఒకేలా ఉంటాయి. కానీ, ఏ డైరెక్టర్ ఎలా చూపించాడు అనేది ముఖ్యం. తాజాగా మోగ్లీ (Mowgli) అనే సినిమా గురించి కూడా నెటిజన్స్ అలాగే మాట్లాడుకుంటున్నారు. సుమ కనకాల కొడుకు రోషన్ కనకాల (Roshan Kankala) బబుల్ గమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.
బబుల్ గమ్ తరువాత రోషన్ హీరోగా వస్తున్న చిత్రం మోగ్లీ. సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి మండోద్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బండి సంజయ్ కుమార్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు మోగ్లీ ఫస్ట్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. న్యాచురల్ స్టార్ నాని వాయిస్ తో రిలీజ్ అయిన ఈ గ్లింప్స్.. చాలామందికి ఎన్నో సినిమాలను గుర్తుచేస్తుంది.
మోగ్లీ కథ తెలియని వారుండరు. అడవిలో తప్పిపోయిన ఒక శిశువును అక్కడ జంతువులన్నీ కలిసి అతనికి మోగ్లీ అని పేరు పెట్టి.. సింహాం బారిన పడకుండా..పెంచుతాయి. అడివిలో మోగ్లీ ఎలా పెరిగి పెద్దవాడయ్యాడు అనేది కథ. ఇక ఈ సినిమా మోగ్లీ 2025 అని ముందే చెప్పుకొచ్చారు. సిగ్నల్ కూడా లేని అడివిలో హీరో జీవిస్తూ ఉంటాడు. అడివి గురించి అతనికి తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు అని చెప్పుకొచ్చారు. ఇక అతనికి ఒక లవ్ స్టోరీ.. అందులో వేలు పెట్టినవాడిని వదలడు అని చెప్పారు. హీరో హీరోయిన్ కి మధ్య ఒక పోలీస్.. అతను కూడా హీరోయిన్ మీద మనసు పడతాడు. హీరోను చంపి హీరోయిన్ ను దక్కించుకోవడానికి కష్టపడుతూ ఉంటాడు. చివరకు హీరో.. విలన్ మధ్య ఫైట్.. కథ సుఖాంతం.
ఇలాంటి కథలు కొత్తవేమీ కాదు. అప్పుడు వచ్చిన జయం నుంచి.. ఈ మధ్య వచ్చిన అహింస వరకు ఇదే స్టోరీ. హీరోలు అడవికి పారిపోయి.. అక్కడ దాక్కోవడం, విలన్ వారిని వెతుక్కుంటూ వచ్చి ఫైట్ చేయడం.. ఇలాంటివన్నీ చూసినవే. ఈ గ్లింప్స్ చూసినా అదే అనిపిస్తుంది. కథ పరంగా కాకుండా సందీప్ టేకింగ్ చాలా కొత్తగా ఉంది అని చెప్పుకోవచ్చు.. కాలభైరవ మ్యూజిక్ సినిమాకు ప్రధానాకర్షణ. ఇక హీరో కంటే విలన్ బండి సరోజ్ కుమార్ పైనే సందీప్ బాగా ఫోకస్ చేసినట్లనిపిస్తుంది. రోషన్ లుక్ మారిస్తే బావుండేదనిపిస్తుంది. బబుల్ గమ్ లో కూడా సేమ్ ఉన్నట్లు ఉంది.
గ్లింప్స్ చూసి ఒక అంచనాకు రాకూడదు కానీ, మొదటి షాట్ లోనే ఇంప్రెషన్ కొట్టేయాలి. కానీ, ఈ గ్లింప్స్ రొటీన్ లానే అనిపిస్తుందని పెదవి విరుస్తున్నారు. మరి టీజర్, ట్రైలర్ తో ఏమైనా హైప్ ఎక్కించే అంశాలను సందీప్ జోడిస్తాడేమో చూడాల. కలర్ ఫోటో సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న డైరెక్టర్ కావడంతో సినిమాపైకొద్దిగా అంచనాలు ఉన్నాయి. అందులో పీపుల్ మీడియా నిర్మిస్తుండడం.. సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. కథలో కొత్తదనం కనుక సందీప్ చూపించగలిగితే మోగ్లీ పాజిటివ్ టాక్ అందుకుంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమాతో రోషన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది చూడాలి.
Janhvi Kapoor: నాకు పెళ్లయ్యింది.. అతడే నా భర్త.. షాక్ ఇచ్చిన జాన్వీ
Komali Prasad: ఫ్రాంఛైజీ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యా..