Komali Prasad: ఫ్రాంఛైజీ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యా..
ABN , Publish Date - Aug 29 , 2025 | 06:52 PM
ఫ్రాంఛైజీ చిత్రాలతో ప్రేక్షకులకు చేరువయ్యా.. ‘హిట్ 2’, ’‘హిట్ 3’ చిత్రాల్లో ఎఎస్‌పీ వర్షగా నటించి మెప్పించారు నటి కోమలి ప్రసాద్.
‘హిట్ 2’, ’హిట్ 3’ (hit 3)చిత్రాల్లో ఎఎస్‌పీ వర్షగా నటించి మెప్పించారు నటి కోమలి ప్రసాద్ (Komali Prasad). ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే ఆమె తాజాగా నెటిజన్లతో మాట్లాడారు. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానమిచ్చింది. ‘హిట్’ ఫ్రాంఛైౖజీలో సపోర్టింగ్ రోల్‌లో కనిపించినందుకు ఎప్పుడూ బాధపడకండి. పోలీస్‌గా నటించే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ఆ పాత్రలో మీరు చాలా బాగా నటించారు’ అని ఓ నెటిజన్ ఆమెకు ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టారు. దానికి కోమలి స్పందించారు. ఆ చిత్రంలో నటించినందుకు చాలా ఆనందంగా ఉన్నానని ఆమె చెప్పారు.
‘స్టార్ హీరోతోపాటు పోలీస్ పాత్రలో కనిపించడం చాలా పెద్ద విషయం. అలాంటి అవకాశం అరుదుగా వస్తుంది. ఆ విషయం ప్రేక్షకులకు కూడా తెలుసు. నేను హిట్ ఫ్రాంఛైజీ చిత్రాలతో ఎంతోమంది ప్రేక్షకులకు చేరువయ్యాను. ఆ సినిమాలో నటించిన తర్వాత నేను విభిన్నమైనపాత్రలు పోషించగలనని నమ్మకం కలిగింది. ఇప్పుడు ఐకానిక్ మార్షల్ ఆర్ట్స్ రివేంజ్ డ్రామా ‘కిల్ బిల్’ వంటి పూర్తిస్థాయి యాక్షన్ చిత్రాలు చేయాలనిపిస్తుంది’ అన్నారామె. ప్రస్తుతం ఆమె నటించిన శశివదనే చిత్రం విడుదలకి సిద్ధమైంది.