సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Baa Baa Black Sheep: మోషన్ పోస్టర్ ఆవిష్కరించిన తరుణ్‌ భాస్కర్

ABN, Publish Date - Oct 02 , 2025 | 04:36 PM

దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనెపూడి నిర్మిస్తున్న 'బా బా బ్లాక్ షీప్' మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ ఈ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు.

Baa Baa Black Sheep Motion Poster launch

గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే వేట.. ముగ్గురి తెలివి తేటలు.. ఒక రోజులో జరిగే ఘటనలు.. ఓ ఆరుగురి ప్రయాణంతో న్యూ ఏజ్ క్రైమ్ కామెడీగా ‘బా బా బ్లాక్ షీప్’ (Baa Baa Black Sheep) అనే చిత్రం రాబోతోంది. దోనెపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనెపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి (Guni Manchikanti) దర్శకత్వం వహిస్తున్నారు. టిను ఆనంద్ (Tinu Anand), ఉపేంద్ర (Upendra), జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని , విష్ణు (Vishnu Oi), కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


దసరా సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన కథ, కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తూ మేకర్స్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేయించారు. ఈ మోషన్ పోస్టర్‌ను చూస్తుంటే.. గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే ఓ న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ అని అర్థం అవుతోంది. ఓ ముగ్గురు చుట్టూ తిరిగే కథ అంతా కూడా ఒకే రోజులో జరుగుతుందని తెలుస్తోంది. ఈ ప్రయాణంలో వారికి ఎదురైన పరిస్థితులు, ఆ పరిస్థితుల్లోంచి పుట్టే కామెడీ, ఈ జర్నీలో జరిగే క్రైమ్ ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌కి కొత్త అనుభూతిని ఇచ్చేలా కనిపిస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించనున్నారు. మిగతా వివరాల్ని మేకర్లు త్వరలోనే ప్రకటించనున్నారు.

Also Read: Pawan Kalyan: జనసేన ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్ళూరి...

Also Read: Chiru - Udit Narayan: మన ఎలివేషన్‌ కంటే ఉదిత్‌ ఎమోషన్‌ స్ట్రాంగ్‌ అయ్యా..

Updated Date - Oct 02 , 2025 | 04:36 PM