Janhvi Kapoor: రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, అల్లు అర్జున్‌.. జాన్వీ ఇమిటేషన్ ఇరగదీసింది

ABN, Publish Date - Aug 12 , 2025 | 03:41 PM

బాలీవుడ్  బ్యూటీ  జాన్వీ సౌత్  స్టార్ హీరోలను ఇమిటేట్ చేసింది. రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, అల్లు అర్జున్‌ దించేసింది. సిద్ధార్థ్‌ మల్హోత్రా (Sidharth Malhotra), జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) జంటగా వస్తున్న సినిమా ‘పరమ్‌ సుందరి’ (Param Sundari). కేరళ అమ్మాయిగా జాన్వీ, డిల్లీ అబ్బాయిగా సిద్ధార్థ్‌ కనిపిస్తారు.   తుషార్‌ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం ట్రైలర్‌ను    విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్‌, మోహన్‌లాల్‌, అల్లు అర్జున్‌లాంటి వారిని ఇమిటేట్‌ చేసి జాన్వీ అలరించారు. 

Updated at - Aug 12 , 2025 | 03:43 PM